Skip to main content

Telugu News Power

కనుల పండుగగా కనకదుర్గమ్మ కళ్యాణం.

అమ్మవారి కళ్యాణోత్సవం నిర్వహిస్తున్న సాయికుమార్ దంపతులు
దుర్గా మల్లేశ్వరి స్వామి కళ్యాణోత్సవాలకు పట్టు వస్త్రాలతో తరలి వెళ్తున్న పెద్ద గోపురం ధర్మకర్తలు

పాలకొల్లు: ఫిబ్రవరి,27(తెలుగు న్యూస్ పవర్) స్థానిక ఎడ్ల బజార్లో వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గ మల్లేశ్వర స్వామి వార్ల కళ్యాణ మహోత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారి కళ్యాణం కన్నుల పండుగగా జరిగింది. చిట్టి సాయి కుమార్,ఈశ్వరి దంపతులు, కల్యాణోత్సవం జరిపించారు. ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్, తులా రామలింగేశ్వరరావు, అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ మీసాల రామచంద్ర రావు, ఈవో ముచ్చర్ల శ్రీనివాసరావు మేళతాళాతో బయలుదేరి అమ్మవారికి ఫల పుష్పాదులతో పట్టు వస్త్రాలు సమర్పించారు. కళ్యాణోత్సవంలో భాగంగా గరగ నృత్యం,బేతాళ నృత్యం ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాల్లో విశేషంగా పేరుగాంచిన భారీ బాణాసంచా కాల్పులు పట్టణ పౌరులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉదయం అగ్ని ప్రతిష్టాపనము, బలిహరణ, వేద పారాయణాసహితంగా నిర్వహించారు. చంద్ర సోమయాజుల వారి ఆచార్యత్వంలో, దేవరకొండ భాస్కర్ శర్మ బ్రహ్మత్వంలో ఈ పూజల ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో, ఆలయ కార్య నిర్వహణ అధికారి ఎన్ సతీష్ కుమార్, బోనంవెంకటనారాయణ రావు, (ముసబు) డాక్టర్ ముచ్చర్ల సంజయ్, మాజీ కౌన్సిలర్ వీరా శ్రీను, గవర యుగంధర్ శేషగిరిరావు, ఆలయ అర్చకులు మోగంటి వెంకటరమణ శర్మ, ధర్మకర్తలు పినిశెట్టి శ్రీనివాస్,భాషను సత్యనారాయణ,గంధం రాజరాజేశ్వరి, తదితర కూటమి నాయకులు, మహిళా భక్తులు విశేషంగా పాల్గొన్నారు. కళ్యాణోత్సవంలో భాగంగా మహిళలకు రవిక గాజులు, కుంకుమ భరిణి, ప్రసాదం అందజేశారు.