Telugu News Power

ఘనంగా ఏ.ఎస్.ఎన్.ఎం. ప్రభుత్వ కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకలు

 

                                                     వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు

పాలకొల్లు, మార్చి,17(తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి (ఏ.ఎస్.ఎన్.ఎం.) ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకలు కళాశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ వేడుకలకు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ తిరువీధుల రాజరాజేశ్వరి అధ్యక్షత వహించారు.
ఈ కార్యక్రమానికి పెనుగొండ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి, కలిదిండి సూర్యనారాయణరాజు కాలేజి కరెస్పాండంట్ , సెక్రటరీ డాక్టర్ కె. రామచంద్ర రాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గౌరవ అతిథిగా ప్రముఖ ఆడిటర్ లయన్స్ పి. లక్ష్మీనారాయణ , ప్రత్యేక అతిథులుగా డాక్టర్ ఎస్.వి. రంగారావు, కె.బి. శ్రీనాథ్, మరియు అద్దేపల్లి మోహన్ దాస్ కార్యక్రమంలో పాల్గొన్నారు.
సభాధ్యక్షురాలు డాక్టర్ తిరువీధుల రాజరాజేశ్వరి కళాశాల వార్షిక నివేదికను సమర్పిస్తూ, 59 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర కలిగిన ఈ విద్యాసంస్థ సాధించిన అద్భుత ప్రగతిని వివరించారు. ముఖ్య అతిథి డాక్టర్ కె. రామచంద్ర రాజు మాట్లాడుతూ, విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవాలని, నిరంతర కృషి ద్వారానే విజయం సాధ్యమని పేర్కొన్నారు.
గౌరవ అతిథి లయన్స్ పి. లక్ష్మీనారాయణ మరియు ప్రత్యేక అతిథులు డాక్టర్ ఎస్.వి. రంగారావు, కె.బి. శ్రీనాథ్, అద్దేపల్లి మోహన్ దాస్ లు ప్రసంగిస్తూ, విద్యాభ్యాసంతో పాటు సామాజిక బాధ్యతను, క్రమశిక్షణను అలవరుచుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేశారు. కళాశాల అభివృద్ధిలో భాగస్వాములైన అందరినీ వారు అభినందించారు.
అనంతరం విద్యా, క్రీడా మరియు సాంస్కృతిక పోటీలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అతిథుల చేతుల మీదుగా బహుమతులు మరియు ప్రశంసా పత్రాలు అందజేశారు. విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక ప్రదర్శనలు అందరినీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ శ్రీ టి కృష్ణ, ఐక్యూఏసి కోఆర్డినేటర్ కె భద్రాచలం, అకాడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వి యామిని,స్టూడెంట్ కౌన్సిల్ కన్వీనర్డాక్టర్ సిహెచ్ ఉషారాణి,తెలుగు శాఖాధిపతి డా బూసి వెంకట స్వామి,ఎన్ ఎస్ ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్స్ డా. ఎం రామకృష్ణ,డా వివి విజయలక్ష్మి, అధ్యాపకులు జీడి శ్రీనివాసరావు,పి శ్రీనివాసరావు,వంశి సుబ్బరాయన్,రమేష్ కుమార్ ,రోహిత్ కుమార్ ,రవికుమార్ ,మనఁదరావు ,ఆశాజ్యోతి ,దుర్గేశ్వరి ,స్వర్ణలత ,శిరీషా ,రామలక్ష్మి, జె కె సి మెంటార్ శిరీష, సూపరెండెంట్ కనకమహాలక్ష్మి , పూర్వ విద్యార్థులు మరియు విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు.