Telugu News Power

రైతన్న నీకోసం” ప్రారంభించిన ఎమ్మెల్యే పులపర్తి, కలెక్టర్ నాగరాణి

రైతన్న నీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు, కలెక్టర్ నాగరాజు
భీమవరం: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కాం)రైతన్నల ప్రయోజనాలను కాపాడుతూ, మరింత ఆర్థిక అభివృద్ధిని సాధించే దిశగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు.
స్థానిక తాడేరు గ్రామంలో వీరభద్ర స్వామి దేవాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “రైతన్న నీకోసం” కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా,ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల కోసం ఎన్నో కార్యక్రమాలను చేస్తున్నారన్నారు. దీనిలో భాగంగా అన్నదాత సుఖీభవ – పీఎం కిసాన్ పథకం కింద అర్హులైన ప్రతి ఒక్క రైతు ఖాతాలో మూడు విడతలుగా రూ 20 వేలను పెట్టుబడి సాయంగా జమ చేశారన్నారు.
పోలవరం పూర్తి అయితే మూడు పంటలు పండించుకునే అవకాశంతో పాటు, పంట భూముల విలువ కూడా పెరుగుతుందన్నారు. మార్కెట్లో డిమాండ్ ఆధారిత పంటలు, సన్న రకాలను పండించాలని సూచించారు. మన జిల్లాలో పండించేది ఎక్కువగా ఎగుమతికి వెళ్తుందని, స్థానిక ప్రజలు వినియోగించే రకాలను మాత్రమే పండించాలని సూచించారు. జిల్లాలోని పంట భూములకు అనువైన సన్న రకాలను పండించడానికి వ్యవసాయ శాఖ పూర్తి సహకారం అందించాలని కోరారు. రైతులకు మేలు జరిగే విధంగా పుంత రోడ్లను, వ్యవసాయ మార్కెట్ కమిటీల ద్వారా నిర్మించేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి దృష్టికి తెచ్చినట్టు వెల్లడించారు. జిల్లాలో సాగునీరు పారుదలలో ఇబ్బంది కారణంగా పొలాలు దెబ్బతింటున్నాయని, కాలువలు, డ్రైయిన్ లు పూడికతీత పనులు, సీమౌత్ డ్రగ్జింగ్ పనులు, ఉప్పుటేరు ప్రక్షాళన పనులను చేయాలని రాష్ట్ర మంత్రితో కలిసి రాష్ట్ర ముఖ్యమంత్రి వివరించామన్నారు. వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు. నాన్ ఆక్వా జోన్లో కూడా విద్యుత్ సబ్సిడీ పై అసెంబ్లీలో ప్రస్తావించినట్టు వెల్లడించారు.ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపనకు ముందుకు వస్తే సబ్సిడీతో మంజూరు చేస్తారన్నారు. కలెక్టర్ నాగరాణి మాట్లాడుతూ, రైతులు సాంకేతికను అందిపుచ్చుకుని పెట్టుబడిని తగ్గించుకోవాలని, డ్రోన్ వినియోగంతో తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనం పొందవచ్చునని అన్నారు. ప్రభుత్వం 6 రోజులపాటు రైతన్న నీకోసం కార్యక్రమాన్ని చేపట్టడానికి నిర్దేశించిందని, 16,17,18, 23,24,25 తేదీలలో వ్యవసాయ, పశు సంవర్ధక, మత్స్య శాఖల అధికారులు, సిబ్బంది జిల్లాలోని ప్రతి రైతు ఇంటికి వెళ్ళి రైతు ప్రయోజనాలను, వ్యవసాయంలో సాంకేతికత జోడింపు, పంట మార్పిడి ప్రయోజనాలు, రైతు యాప్ ప్రయోజనాలు, తదితర అంశాలపై రైతులకు వివరించనున్నట్లు తెలిపారు. ప్రతి రైతు తప్పనిసరిగా రైతు యాప్ ను డౌన్లోడ్ చేసుకుని వినియోగించేలా విఎఎలు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం రైతన్న సేవలో మన మంచి ప్రభుత్వం కరపత్రాన్ని ఆవిష్కరించారు. అధికారులు, రైతులు, గ్రామస్తులు, కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.