Skip to main content

Telugu News Power

శ్రీ మావుళ్ళమ్మ ను దర్శించుకున్న కమిటీ

కమిటీ సభ్యులకు ఆశీర్వచనం చేస్తున్న దృశ్యం

భీమవరం: మార్చి, 24(తెలుగు న్యూస్ పవర్. కామ్)
పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి హామీల కమిటీ, పశ్చిమ గోదావరి జిల్లా పర్యటన లో భాగంగా హామీల కమిటీ ప్రెసిడెంట్ నంద్యాల జిల్లా కు చెందిన ఎమ్మెల్సీ ఐజాక్ భాష , సభ్యులు పశ్చిమ గోదావరి జిల్లా కు చెందిన సభ్యులు ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, కడప జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ, ఎం వి రామచంద్ర రెడ్డి వారు శ్రీ మావూళ్ళమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ మర్యాదలతో దేవస్థానం అధికారులు, ధర్మకర్తలు మండలి స్వాగతం పలికారు. అర్చకులు పూజలు, ఆశీర్వచనాలు నిర్వహించారు. దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్ బుద్ధ మహాలక్ష్మి నగేష్ వీరికి శేషవస్త్రం ప్రసాదం, అమ్మవారి చిత్రపటం అందచేసారు.ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం మరియు ధర్మకర్తలు, దేవదాయ ధర్మదాయ శాఖ రాజమహేంద్రవరం రీజనల్ జాయింట్ కమిషనర్ త్రినాధరావు, చీఫ్ ఇంజనీర్ జి శేఖర్, శ్రీనివాస్ రావు, పశ్చిమ గోదావరి జిల్లా దేవదాయ ధర్మదాయ అసిస్టెంట్ కమిషనర్ వి హరిసూర్య ప్రకాష్, భీమవరం దేవదాయ ధర్మదాయ శాఖ తనిఖీదారు వి వెంకటేశ్వరరావు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.