Telugu News Power

జాతీయ రహదారి 165 నిర్మించి తీరుతా. -అపోహలు కొట్టిపారేసిన కేంద్రం మంత్రి వర్మ.

తిరుపతికి రైలు సేవలు ప్రారంభిస్తున్న కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
కేంద్ర ఉపరితల రవాణా శాఖ మాత్యులు నితిన్ గడ్కరి విజయవాడలో హామీ ఇస్తున్న దృశ్యం

భీమవరం: ఏప్రిల్, 13(తెలుగు న్యూస్ పవర్. కామ్) జాతీయ రహదారి 165 నిర్మించి తీరుతామని, స్థానిక ఎంపీ, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ సోమవారం స్పష్టం చేశారు. సాక్షాత్తు కేంద్ర ఉపరితల రవాణా శాఖ మాత్యులు నితిన్ గడ్కరీ విజయవాడలో ముఖ్యమంత్రి సమక్షంలో జరిగిన సభలో దిగమర్రు నుంచి ఆకివీడు వరకు 45 కిలోమీటర్ల హరిత రహదారి ఏర్పాటుకు రూ.2.4 వేల కోట్లు మంజూరు చేసినట్టు ప్రకటించారని వెల్లడించారు. బైపాస్ రోడ్డు నిర్మాణం గత 15 ఏళ్లుగా యదాస్థితిలో ఉందన్నారు. తాను ఎంపీ అయిన తరువాత సర్వే చేయించి, అలైన్మెంట్లు ఏది సురక్షితంగా, తక్కువ ఖర్చుతో త్వరగా పూర్తయి, ఆయన మెంటుతో నిర్మించాలని భావిస్తున్నట్టు తెలిపారు. నీ ప్రాంత అభివృద్ధికి ఈ రోడ్డు నిర్మాణం ఎంతో కీలకమని పేర్కొన్నారు. భీమవరం బైపాస్ రోడ్డు నిర్మాణం సంయుక్తంలో ఉండటం వల్ల, బైపాస్ రోడ్డుతో ఆ సమస్య తీరనున్నందున కనులు ప్రారంభించడానికి ప్రయత్నం జరుగుతుందన్నారు. ఈ రోడ్డు నిర్మాణానికి దశాబ్ద కాలంగా సర్వేలు జరగడం, డిపిఆర్ తయారవుతున్నాయని చెప్పుకోవడం జరిగింది. ఎందుకు రెండు మార్గాలు ఉన్నాయని, ఒకటి ఆక్వా చెరువుల మధ్య నుంచి వెళుతుందని, ఇందులో కొంత రిస్కు ఉందని, బియ్యం కూడా మూడు రెట్లు అవుతుంది అని అధికారులు అంచనా వేశారు. మరో మార్గానికి రూ.12 వందల కోట్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేశారు. ఏదో ఒక బడిన ఈ ప్రాంతానికి ఈ రహదారి వల్ల ఆర్థిక ప్రయోజనాలతో పాటు, ఈ ప్రాంత ప్రజలకు ఉపాధి మార్గం అవుతుందని ప్రజలు భావిస్తున్నారు. దీనిపై కొని వర్గాల వారు జాతీయ రహదారి 165 పూర్తి కాదని ప్రజల్లో అపోహలు సృష్టించి ఆందోళన కలిగిస్తున్నారు. దీనిపై వెంటనే కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్పందిస్తూ అనుమానాలు పటాపంచలు చేశారు.