పాలకొల్లు: ఏప్రిల్, 15(తెలుగు న్యూస్ పవర్. కామ్)చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలోబుధవారం యమహా, రాయల్ ఎన్ఫీల్డ్, ఎమరాల్డ్, కేటర్ పిల్లర్,వోల్టా కంపెనీలలో ఉద్యోగాలకు నిర్వహించిన క్యాంపస్ ఇంటర్వ్యూలలో 95 మంది అభ్యర్థుల హాజయ్యారు. వీరిలో 52 మంది ఎంపిక అయ్యారు. వారిలో 47 మంది చాంబర్స్ విద్యార్థులేనని కళాశాల చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు తెలియజేశారు.
మూడు రౌండ్లు రాత పరీక్ష , గ్రూపు డిస్కషన్, మౌఖిక పరీక్షలు నిర్వహించి అభ్యర్థులను ఎంపిక చేశారు.ఎంపికైన అభ్యర్థులకు 14 నుంచి 25 వేల రూపాయలువరకు జీతర, ఇతర సదుపాయాలు ఉంటాయని తెలియజేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ కె.వి.ఆర్ నరసింహారావు, మాట్లాడుతూ, ఛాంబర్స్ కళాశాలలో చదివిన విద్యార్థులకు డిగ్రీ తో పాటు ఉద్యోగాల కల్పనకు నిరంతర శిక్షణ, భావవ్యక్తీకరణ, కంప్యూటర్ స్కిల్స్ వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నామని, అత్యధిక స్థాయిలో ఉద్యోగాలు ఇస్తున్నామని ఇప్పటివరకు 520 మందికి ఉద్యోగాల నియామక పత్రాలు అందజేశారని ఫైనల్ డిగ్రీ పూర్తి కాకుండానే విద్యార్థులు ఉద్యోగాలకు ఎంపికై, ప్రముఖ కంపెనీలలో పని చేస్తున్నారని తెలియజేశారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి. వెంకటేశ్వర్ రావు, అకాడమిక్ అడ్వైజర్ డాక్టర్ ఎబిఎస్ మూర్తి, ప్లేస్మెంట్ ఆఫీసర్స్ జానకిరామయ్య, మీనా లు పాల్గొన్నారు.