నర్సాపురం: ఏప్రిల్ ,16(తెలుగు న్యూస్ పవర్. కం) బీసీల కోసం ఎవరు ఉద్యమాలు చేసిన వారధిస్తామని నర్సాపురం శాసనసభ్యులు,ప్రభుత్వ విప్ బొమ్మిడి నాయకర్ పేర్కొన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం జరిగిన విలేకరుల సమావేశంలో నాయకర్ మాట్లాడుతూ, బీసీ నాయకులు స్వప్రయోజనాల కోసం, ఎవరు ప్రేరేపిస్తే చేసే ఉద్యమాలకు బీసీలు ఎవరు మద్దతు తెలపరని స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంలో ఉన్న పార్టీలన్నీ బీసీల పక్షపాతిగా ఉన్నట్లు వివరించారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు అన్న ఎన్టీఆర్ బీసీలకు రిజర్వేషన్ కల్పించిన తొలి నాయకుడు అని గుర్తు చేశారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీల పార్టీగా మొదలు పడిందన్నారు. బీసీల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలు తెలుగుదేశం ప్రభుత్వం ప్రవేశపెట్టిందన్నారు. త్వరలో ఆదరణ పథకం అమల్లోకి తెచ్చి చేతివృత్తుల వారికి అవసరమైన పరికరాలు అందజేస్తామన్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టి చిరంజీవి 100కు పైగా బీసీలకు సీట్లు ఇచ్చి చరిత్ర సృష్టించారని వెల్లడించారు. జనసేన పార్టీ పితాని బాలకృష్ణ కు మొట్టమొదటి సీటు ప్రకటించిన విషయాన్ని మర్చిపోకూడదన్నారు. మత్స్యకారుల జీవితాల్లో చీకట్లో నింపే జీవోకు వ్యతిరేకంగా వేలాదిమందితో నరసాపురంలో ఉద్యమం చేసిన చరిత్ర జనసేన పార్టీకి ఉందన్నారు.కూటమి ప్రభుత్వంలోనే బీసీల ప్రగతికి పథకాలు అమలవుతున్నాయన్నారు.
కూటమి ప్రభుత్వం బీసీలకు మద్దతు.
విలేకరుల సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే నాయకర్