Telugu News Power

రద్దీ రైల్వే స్టేషన్లలో 7 స్థానంలో విజయవాడ.

విజయవాడ: ఏప్రిల్,18(తెలుగు న్యూస్ పవర్. కామ్)
దేశంలో అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ల జాబితా లో రైళ్ళ రాకపోకలుఆధారంగా 2024–2025 సంవత్సరానికి సంబంధించిన తాజా రైల్వే శాఖ శనివారంప్రకటించింది. ఈ జాబితాలో దేశంలోని అత్యంత రద్దీ రైల్వే స్టేషన్ల లో ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ జంక్షన్ 7వ స్థానంలో నిలిచింది.
ప్రథమ స్థానంలో చత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినస్, ముంబై ఉండగా, రోజుకు 1,250 రైళ్ళ రాకపోకలతో దేశంలోనే అత్యంత రద్దీ స్టేషన్‌గా నమోదైంది. రెండో స్థానంలో హౌరా జంక్షన్ 974–1,000 రైళ్ల రాకపోకులతో 2వ స్థానంలోనిలిచింది.
న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ 931 రైళ్లతో మూడో స్థానంలో ఉండగా, కల్యాణ్ జంక్షన్ 813–908 రైళ్లతో నాలుగో స్థానంలో ఉంది. కాన్పూర్ సెంట్రల్ 890 రైళ్లు, పాట్నా జంక్షన్ 771 రైళ్లు, విజయవాడ జంక్షన్ 760 రైళ్లతో వరుసగా ముందువరుసలో ఉన్నాయి.
విజయవాడ జంక్షన్ రోజుకు సుమారు 760 రైళ్ల రాకపోకలతో దేశవ్యాప్తంగా 7వ స్థానంలో నిలిచింది. ఈ స్టేషన్ దక్షిణ, తూర్పు భారతదేశాలను అనుసంధానించే కీలక రైల్వే హబ్‌గా గుర్తింపు పొందుతోంది. దేశంలో మొత్తం 9 రద్దీ రైల్వే స్టేషన్లను రైల్వే శాఖ గుర్తించింది.