Skip to main content

Telugu News Power

పవన్ కళ్యాణ్ శస్త్ర చికిత్స విజయవంతం.

శస్త్ర చికిత్స అనంతరం ఆసుపత్రిలో పవన్ కళ్యాణ్

హైదరాబాద్: ఏప్రిల్ 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగువారి అభిమాన నటుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ శస్త్ర చికిత్స విజయవంతం అయ్యిందని అపోలో ఆసుపత్రి వర్గాలు మంగళవారం విడుదల చేసిన వైద్య బులిటిన్ లో పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ హైదరాబాద్, జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆసుపత్రిలో సైనసైటిస్ (ముక్కు/సైనస్ సమస్య) కోసం శస్త్రచికిత్స చేయించుకున్నారు.
ఆయనకు నిర్వహించిన “ఫంక్షనల్ ఎండోస్కోపిక్ సైనస్ సర్జరీ (ఎఫ్ ఇ ఎస్ ఎస్)”. ఇది ఎండోస్కోపీ ద్వారా ముక్కు లోని సైనస్ మార్గాల్లో ఉన్న పాలిప్స్, వాపులను తొలగించే చిన్నపాటి ఆపరేషన్. వైద్యుల ప్రకటన మేరకు, సర్జరీ విజయవంతంగా పూర్తయింది; పవన్ కళ్యాణ్ ఆరోగ్యం నిలకడగా ఉంది. ఆయన కోలుకుంటున్నారని తెలుస్తోంది. వైద్యులు సుమారు 10 రోజుల పాటు పూర్తి విశ్రాంతి తీసుకోవాలని సూచించారు. శ్వాస సమస్య తన జాగ్రత్తలు సూచించారు.
పవన్ కళ్యాణ్ ఆరోగ్యం కుదురుపడాలని సినీ, రాజకీయంగా రంగానికి చెందిన పోలవరం ప్రముఖులు అభిమానులు ఆయనకు వివిధ దేవాలయాల్లో వివిధ రాష్ట్రాల్లో పూజలు నిర్వహించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఆరోగ్యం గురించి ఆరా తీశారు. పవన్ కళ్యాణ్ ఆరోగ్యం పై ఎలాంటి ఆందోళన చందనోత్సవం లేదని వైద్యులు నిర్ధారించారు.