Skip to main content

Telugu News Power

జలవనురుల నిధులు రూ. 3 కోట్ల పనులకు మంత్రి శంకుస్థాపన.

కాపవరంలో మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్ రావు తో కలిసి శంకుస్థాపన చేస్తున్న మంత్రి నిమ్మల

పాలకొల్లు: ఏప్రిల్, 21(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక అరట్లకట్ట, కొమ్ము చిక్కాల, కాపవరం గ్రామాల్లో అభివృద్ధి పనులకు స్థానిక ఎమ్మెల్యే, మంత్రి నిమ్మల రామానాయుడు మంగళవారం శంకుస్థాపన చేశారు. అరట్లకట్టలో రూ. 50 లక్ష్యంతో సీసీ వాల్ నిర్మాణం, రూ. 20 లక్షలతో పైపు కల్వర్టు, గ్రావెల్ రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. కొమ్ముచిక్కాల లో రూ.75 లక్షలతో సి సి వాల్ నిర్మాణం,రూ.31.29 లక్షలతో మరో సిసి వాళ్ళ నిర్మాణానికి శంకుస్థాపనలు చేశారు. కాపవరం రూ.62.40 లక్షలతో సి సి వాల్ నిర్మాణం,రూ.44.80 లక్షలతో గ్రావెల్ రోడ్డు,రూ.20.50 లక్షలతో ట్రావెల్ రోడ్డు పను లకు శంకుస్థాపనలు జరిగాయి. ఈ కార్యక్రమంలో ఏం సి చైర్మన్ కోడి విజయ భాస్కర్, పాముల రజిని కుమార్, తులా రామలింగేశ్వర రావు,నెక్కంటి ఆదినారాయణ, పచ్చ సాయి, శ్రీనివాసరాజు గొట్టుముక్కల సూర్యనారాయణ రాజు, అంగర వీరభద్ర కుమార్, ప్రసాద్, కోలాటి రాధా, ఇంటి శ్రీరాముడు, పొత్తూరు రాజు, లోకేష్, పీతల శ్రీనివాస్, మచ్చ సత్యనారాయణ రాజు తదితరులు పాల్గొన్నారు.