Telugu News Power

ఫీజు కట్టి మీ అమ్మాయిని తీసుకెళ్లండి. ఆరోపణలు ఖండించిన ప్రిన్సిపాల్.

పాలకొల్లు: ఏప్రిల్, 23(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక వెలమగుడానికి చెందిన నాగేంద్ర, రమాదేవి ఇద్దరు పిల్లలు ప్రైవేట్ పాఠశాలలో ఒకటో తరగతి, ఎల్కేజీ చదువుతున్నారు. పాఠశాల నుంచి విద్యార్థులను తీసుకురావడానికి మేనమామ నాగరాజు పాఠశాలకు వెళ్లారు. పాఠశాల సిబ్బంది బకాయి ఉన్న ఫీజులు పూర్తిగా చెల్లిస్తే గాని బాలికలు ఇంటికి పంపమని చెప్పినట్టు ఆరోపించారు. ఈ సందర్భంగా వాగ్వివాదం జరిగినట్టు తెలిపారు. ఎస్ఎఫ్ఐ దృష్టికి విద్యార్థిని తల్లిదండ్రులు తీసుకువెళ్లారు. మండల విద్యాశాఖ అధికారులు గుమ్మల్ల వీరాస్వామి, గంగాధర శర్మకు ఫిర్యాదు అందజేశారు. వీరు పాఠశాలకు వెళ్లి విచారించారు. తమ విచారణ వివరాలు పై అధికారులకు తెలియజేస్తామని పేర్కొన్నారు. సన్ షైన్ పాఠశాల ప్రిన్సిపాల్ అరుణ వివరణ ఇస్తూ, విద్యా సంవత్సరం ముగిసినందున బకాయిలు రూ.34 వేలు చెల్లించాలని కోరినట్టు తెలిపారు. నాగరాజు మద్యం మత్తులో సిబ్బందితో దురుసుగా ప్రవర్తించినట్లు వెల్లడించారు. విద్యార్థిని వెంటనే పంపించి వేసినట్లు తెలిపారు.

ఎంఈఓ మీరా స్వామి విచారణ జరుపుతున్న దృశ్యం