Telugu News Power

ప్రపంచ పర్యాటక పటంలో ఆంధ్ర ప్రదేశ్ ను అగ్రస్థానంలో నిలుపుతాం. పుష్కరాల ఏర్పాట్లపై సమీక్ష లో -మంత్రి కందుల దుర్గేష్

రాజమహేంద్రవరం: ఏప్రిల్,25(తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రపంచ పర్యాటక పటం లో రాష్ట్రన్ని అగ్రస్థానంలో నిలుపుతామని రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి పందుల దుర్గేష్ పేర్కొన్నారు. పర్యాటక శాఖ అధికారులతో శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ,ఆంధ్రప్రదేశ్ లో ప్రకృతి ఆరాధకులకు,
కేరళకు మించిన సౌందర్య ప్రదేశాలు ఎన్నో ఉన్నాయని తెలిపారు. సరైన ప్రచారం, పక్కా ప్రణాళికతో ప్రపంచ పర్యాటక పటంలో మన రాష్ట్రాన్ని సగర్వంగా నిలబెట్టగల ప్రయత్నం చేస్తున్నామన్నారు.
గోదావరి పుష్కరాల నాటికి లక్షలాది మంది భక్తులు వచ్చే నేపథ్యంలో భక్తులు, పర్యాటకులకు మెరుగైన సౌకర్యాలు కల్పించే దిశగా కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి సూచనలతో 21 ప్రధాన దేవాలయాల వద్ద ‘టెంట్ సిటీలు’ ఏర్పాటు చేసి, ఎలాంటి ఇబ్బందులు లేకుండా వసతి సదుపాయాలు అందించేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని వెల్లడించారు..పర్యాటక రంగంలో ప్రజల భాగస్వామ్యాన్ని పెంచేందుకు ‘హోమ్ స్టే’ సంస్కృతిని ప్రోత్సహిస్తున్నామని వెల్లడించారు. గ్రామీణ వాతావరణాన్ని ఆస్వాదించాలని ఆశించే పర్యాటకులకు ఇది మంచి అవకాశం కాగా, స్థానిక ప్రజలకు ఉపాధి మార్గాలను కూడా విస్తరిస్తుందన్నారు. వచ్చే ఐదేళ్లలో రాష్ట్రవ్యాప్తంగా 50 వేల
గదుల నిర్మాణం లక్ష్యంగా ముందుకు సాగుతున్నట్టు తెలిపారు. గోదావరి టూరిజం సర్క్యూట్ ద్వారా జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.వైజాగ్–అరకు మధ్య విజయవంతమైన కారవాన్ టూరిజం నమూనాను, గోదావరి జిల్లాల్లో కూడా అమలు చేయనున్నట్లు తెలిపారు. కాకినాడ, ఉప్పాడ, పేరుపాలెం బీచ్‌లను ‘బ్లూ ఫ్లాగ్’ బీచ్ లుగా గుర్తింపు పొందేందుకు చర్యలు ప్రారంభించామన్నారు. పర్యాటక ప్రాజెక్టుల అమలు, నిర్వహణలో నిర్లక్ష్యం వహించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటూ, సమయానికి పనులు పూర్తి అయ్యేలా పర్యవేక్షణ పెంచుతున్నామని తెలిపారు.

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నాయకత్వంలో, కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర పర్యాటక రంగంలో వేగవంతమైన అభివృద్ధి సాధిస్తున్నాముమని పేర్కొన్నారు. పెట్టుబడిదారులకు పూర్తి సహకారం అందిస్తూ, అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసి, ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా కట్టుబడి ఉన్నామని తెలిపారు.

పర్యాటక అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న మంత్రి కందుల