పాలకొల్లు:మే,1(తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయంప్రతిపత్తి కళాశాల, నూతన ప్రిన్సిపల్ (పూర్తి అదనపు బాధ్యతలు) గా
డాక్టర్ కే. రత్న మాణిక్యం శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం వీరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల, చింతూరు ప్రిన్సిపల్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఈ సందర్భంగా కళాశాల సీపీడీసీ కార్యదర్శి డాక్టర్ బి.వి. రాఘవయ్య మాట్లాడుతూ, డాక్టర్ రత్నమాణిక్యం అనుభవం, నాయకత్వం కళాశాల అభివృద్ధికి తోడ్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.వైస్ ప్రిన్సిపల్ టి. కృష్ణ మాట్లాడుతూ, కొత్త ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో కళాశాల మరింత ప్రగతి సాధిస్తుందని, విద్యార్థుల శ్రేయస్సుకు అనేక కార్యక్రమాలు చేపడతారని విశ్వాసం వ్యక్తం చేశారు.
క్రొత్త గా ఛార్జ్ తీసుకున్న ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, తనకు ఇటువంటి అవకాశం కల్పించిన ఉన్నత విద్యాశాఖా కమిషనర్ డా నారాయణ భరత్ గుప్తా,జాయింట్ డైరెక్టర్ డా సిహెచ్ కృష్ణ ,స్థానిక యం యల్ ఏ మరియు జలవనరుల శాఖామంత్రి వర్యులు డా నిమ్మల రామానాయుడు కి కృతఙ్ఞతలు తెలియజేసారు.తమపై ఉంచిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తూ, కళాశాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.విద్యార్థుల విద్యా ప్రమాణాలు పెంపొందించేందుకు, సిబ్బందితో సమన్వయంగా పని చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో కళాశాల ఎకడమిక్ కోఆర్డినేటర్ డాక్టర్ వి యామిని,ఐక్యూఏసి కోఆర్డినేటర్ కె భద్రాచలం,తెలుగు విభాగాధిపతి డాక్టర్ బూసి వెంకటస్వామి, జంతు శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ ఎం రామకృష్ణ, అర్థశాస్త్ర విభాగాధిపతి డాక్టర్ సిహెచ్ ఉషారాణి, అధ్యాపకులు డాక్టర్ వి విజయలక్ష్మి, జి డి శ్రీనివాసరావు,పి శ్రీనివాసరావు, ఏ వంశి సుబ్బరాయన్ ,సి హెచ్ రవికుమార్ ,కె పార్ధసారధి,బి రామలక్ష్మి ,కె శివకృష్ణ ,బి రమేష్ కుమార్ ,వి శిరీషా ,డి మన్మధరావు ,పి దుర్గేశ్వరి ,కె స్వర్ణలత ,బి ఆశా జ్యోతి ,పి దుర్గారావు ,వి రమేష్ ,కె రోహిత్,పి జోత్స్నాశ్రీ ,డి హెప్సిరాణి,యం దివ్య ,జి వేణుమాధురి ,యం శిరీషా ,యస్ శ్రీదేవి ,సూపరిండెంట్ శ్రీమతి బి కనకలక్ష్మి,సీనియర్ అసిస్టెంట్ రమణమూర్తి ఇతర అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు