యలమంచిలి:మే, 5(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక కాలంపూడి గ్రామంలో బూన్ వైన్స్ షాపులో అగ్నిప్రమాదం రాత్రి 11 గంటల సమయంలో తమకు వచ్చిన ఫోన్ కాల్ ద్వారా గుర్తించినట్టు నరసాపురం ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ రాంబాబు మంగళవారం తెలియజేశారు. ఈ షాపులో రూ. 1.40 కోట్ల విలువైన మద్యం నిల్వలు ఉన్నట్టు తెలిపారు. ప్రమాదంలో 90 శాతం వరకు సరుకు నష్టం జరిగిందని తాత్కాలిక అంచనా వేస్తున్నట్లు తెలిపారు. ఎదురుగా ఉన్న కూడా ఉన్నా కూడా కొంత మేర నష్టం జరిగినట్టు వెల్లడించారు. ఈ ప్రమాదం సంభవించడానికి కారణాల కోసం అగ్నిమాపక దళం, స్థానిక పోలీసులు విచారణ చేపట్టారని వివరించారు. ఇది సహజంగా జరిగిన ప్రమాదమా, కావాలనే ఎవరైనా దుండగులు సృష్టించిన ప్రమాదమా తేలవలసి ఉందన్నారు.
మద్యం షాపులో అగ్ని ప్రమాదం. రూ. 1.40 కోట్ల మద్యానికి ముప్పు.
ప్రమాదం జరిగిన షాపులో సరుకు పరిశీలిస్తున్న దృశ్యం