యలమంచిలి:మే,5(తెలుగు న్యూస్ పవర్. కాం) పదవ తరగతి అత్యుత్తమ ఫలితాలు సాధించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మట్లపాలెం లో మంగళవారం సత్కార సభ జరిగింది. స్థానిక యుటిఎఫ్
మండలంలో శాఖ ఆధ్వర్యంలో ఈ అభినందన కార్యక్రమం జరిగింది.మండలంలోని ప్రథమ, ద్వితీయ తృతీయ స్థానాలు సాధించిన వారికి అలాగే మండలంలో ఉన్న 11 ఉన్నత పాఠశాలలో ఉన్నత పాఠశాలలో లో ప్రథమ స్థానం సాధించిన వారికి,550 మార్కులు పైబడిన విద్యార్థులకు ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ శ్రీ బొర్రా గోపీ మూర్తి సమక్షంలో అభినందన కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి యుటిఎఫ్ మండల అధ్యక్షులు, గుత్తిందీవి శ్రీనివాసరావు అధ్యక్షత వహించారు. మండల విద్యాశాఖాధికారిణి ఆకుల శ్రీవాణి స్థానిక పాఠశాల ప్రధానోపాధ్యాయిణి రాధికా రాణి, పాఠశాల ఎస్ఎంసి చైర్మన్ కట్ట కృష్ణ మట్లపాలెం, నార్ని మెరక గ్రామ మాజీ సర్పంచ్ చల్లా విశ్వేశ్వర రావు, సర్పంచ్ వలవల వెంకట నాగలక్ష్మి( నల్లయ్య ), బాలాజీ, స్థానిక నాయకులు రవి వర్మ ఎక్సైజ్ సీఐ వరహాల రాజు, తాతబ్బాయి ఫౌండేషన్ చైర్మన్ తిరుమల రాజు, పశ్చిమగోదావరి జిల్లా యుటిఎఫ్ నాయకులు పోలిశెట్టి క్రాంతి కుమార్, పిఎస్ విజయరామరాజు, రామానుజరావు, రాజశేఖర్, రామకృష్ణ, యుటిఎఫ్ మండల నాయకత్వం, మండలంలోని అన్ని ఉన్నత పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, అభినందన పొందే విద్యార్థిని విద్యార్థులు వారి తల్లిదండ్రులు గ్రామ పెద్దలు విద్యాభిమానులు శ్రేయోభిలాషులు మరియు ఇతరులు పాల్గొన్నారు.
స్థానిక పెద్దలు రవి వర్మ గారు జిల్లా స్థాయి ప్రథమ స్థానం సంపాదించిన విద్యార్థినికి రెండు సంవత్సరాల పాటు ఫీజు చెల్లించడానికి ముందుకు వచ్చారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖ అధికారి, ఉపాధ్యాయ బృందం కొంత ఆర్థిక సహకారం అందించారు. విద్యార్థిని విద్యార్థులందరికీ మండల శాఖ పక్షాన సర్టిఫికెట్ ఫైల్స్ అందజేశారు.
ఉభయగోదావరి జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ బొర్రా గోపి మూర్తి డిక్షనరీలు అందజేశారు.ఈ కార్యక్రమంలో వక్తలు చక్కటి ఉపన్యాసాలు ఇచ్ఛారు. గ్రామ ప్రముఖులు ఆర్థిక సహకారం ఐందించారు.
పదవతరగతి ప్రతిభావంతులకు యూటీఎఫ్ అభినంద సభ
యూటీఎఫ్ ఆధ్వర్యంలో పదో తరగతి ప్రతిభవంతులకు పురస్కారం అందజేస్తున్న దృశ్యం