Telugu News Power

ఆక్వా రైతుల సమస్యలపై ఈనెల 15 నుంచి కార్యాచరణ. -రాష్ట్ర సమావేశంలో నిర్ణయం.

ఆక్వా రైతు సంఘం సమావేశంలో భగవాన్ రాజు, తదితరులు

పాలకొల్లు: మే, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) వ్యవసాయ శాఖ మంత్రి అచ్చం నాయుడు ఆధ్వర్యంలో ఈనెల 15 న జరిగే సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను బట్టి కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ఆక్వా సంఘం నిర్ణయించింది. శ్రీ క్షీరా రామ జై భారత్ ఆక్వా సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు అధ్యక్షతన బుధవారం, పాలకొల్లులో జరిగిన రాష్ట్రస్థాయి సమావేశంలో నిర్వహించారు. వనామి రొయ్యల ఫీడ్ ధర రూ.8 వేలు, టైగర్ రొయ్య ఫీడ్ రూ. 10 వేలు పెంచటం పట్ల సమావేశంలో తీవ్ర నిరసన వ్యక్తం అయింది. ఫీడు తయారు చేసే కంపెనీలు సిండికేట్ కావటం వల్లే రేట్లు పెరిగాయని సమావేశంలో ఆరోపించారు. ఈ రేట్ల పెంపు రైతులకు పెనుభారంగా మారిందని, రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని సమావేశంలో రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. మంత్రి అచ్చెం నాయుడు, అప్సడ ఉపాధ్యక్షులు, ఫిషరీస్ కమిషనర్ తో ఏర్పాటు అయిన రాష్ట్ర స్థాయి కమిటీ సమావేశం లో శుక్రవారం జరిగే తీర్మానాల మేరకు కార్యాచరణ తీసుకోవాలని సమావేశం తీర్మానించింది. ఈ సమావేశంలో, కార్యదర్శి బోణం వెంకట నరసయ్య, మేడిది జాన్ డేవిడ్ రాజు, దాట్ల సోమేశ్వర రాజు, సజ్జ బుజ్జి, బోనం రంగయ్య నాయుడు, ఉమ్మడి ఉభయగోదావరి, శ్రీకాకుళం,విశాఖపట్నం , ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు చెందిన ఆక్వా రైతు సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.