Telugu News Power

శ్రామికులను సత్కరించిన మంత్రి నిమ్మల.

పాలకొల్లు: జూన్,6(తెలుగు న్యూస్ పవర్. కామ్) గత 40 రోజులు గా మండుటెండలో పనిచేసిన ఉపాధి హామీ శ్రామికులకు స్థానిక ఎమ్మెల్యే, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు సత్కరించారు. ఈ సందర్భంగా, యోగ క్షేమాలు ప్రస్తావించారు. మంత్రి వారికి విందు ఏర్పాటు చేశారు. లాటరీ పద్ధతిలో వారికి చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం నిర్వహించడానికి సహకరించిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. తన పిలుపుకు గౌరవం ఇచ్చి, పని చేసిన పార్టీ శ్రేణులకు అభినందనలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు, పాముల రజనీ కుమార్, గోగులమండ బాబు, యేసు దయ, నున్నబోయిన నాగరాజు, వేగేసిన శ్రీహరి రాజు, ఇజ్రాయిల్, వెంకటేశ్వరరావు, హరి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.