Skip to main content

Telugu News Power

జై భీమ్ ఫౌండేషన్ చేయూత.

యలమంచిలి: జూన్, 11 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక మట్లపాలెం గమల్లపెంటకు చెందిన జై భీమ్ యువజన ఫౌండేషన్, పక్షవాత అనారోగ్యంతో బాధపడుతున్న, చింత దిబ్బకు చెందిన చివ్వేటి ఆనంద్, వారి సతీమణి సత్యవతి కుటుంబానికి
17 వేల500 రూపాయల ఆర్థిక సహాయం అందజేశారు. ఫౌండేషన్ ప్రతినెలా, మానవీయ కోణంలో ఆలోచించి, ఇబ్బందులు పడుతున్న వారికి ప్రతినెలా ఫౌండేషన్ ద్వారా ఆర్థిక సహాయం అందించి ఆదుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో, వ్యవస్థాపక అధ్యక్షులు, మదర్ తెరిసా అవార్డు గ్రహీత గడ్డం సునీల్ గవాస్కర్, ఉపాధ్యాయులు సత్యనారాయణ, అభి, చెల్లుబోయిన శ్రీనివాస్, రాజశేఖర్, ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత భవానీ ప్రసాద్ పాల్గొన్నారు. నవ భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా, మదర్ శిరీష సేవా భావంతో ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు.