Skip to main content

Telugu News Power

అమ్మ ట్రస్ట్ చే అనాధకు మృతదేహానికి అంత్యక్రియలు.

పాలకొల్లు: జూన్, 12 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక రైల్వే స్టేషన్ లో ఓ అనాధ మృతదేహాన్ని శుక్రవారం గుర్తించారు. ఇందుకు సంబంధించి అమ్మా చారిటబుల్ ట్రస్ట్ కు రైల్వే పోలీసులు సమాచారం అందజేశారు. మృతదేహాన్ని స్థానిక ఎడ్ల బజార్లో ఉన్న స్మశాన వాటికకు తరలించి, అమ్మ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల ఆధ్వర్యంలో అంత్యక్రియలు పూర్తి చేశారు. ట్రస్ట్ సభ్యులు మణికంఠ, నాయుడు, దీపేష్,భార్గవ్ అధ్యక్షులు అంబటి సాయి తేజ, ఈ కార్యక్రమంలో తమ సేవలు అందించారు. మానవత్వం పరిమళింపజేసిన అమ్మ ట్రస్ట్ సభ్యులకు పట్టణ ప్రజలు అభినందనలు తెలియజేశారు.