Telugu News Power

చించినాడ వంతెన పై ఆకతాయిలకు చెక్ పెట్టిన సీఐ వి. సురేష్ బాబు

మలికిపురం/యలమంచిలి: జూన్, 13 (తెలుగు న్యూస్ పవర్. కామ్) దాదాపు ఏడాది కాలంగా ఉభయ గోదావరులను కలిపే చించినాడ-దిండి వంతెన ట్రాఫిక్ నియంత్రించిన ప్రాంతాన్ని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా, మలికిపురం మండలం సిఐ వి సురేష్ బాబు పరిశీలించారు. తూర్పుగోదావరి జిల్లా విద్యార్థులు నిత్యం బస్సుల్లో పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న వివిధ కళాశాలలో చదువు కోసం వస్తుంటారు. వంతెన పై భారీ వాహనాల రాకపోకలు నిషేధించారు. విద్యార్థులను తీసుకువచ్చే బస్సు ఈ సమస్య వల్ల ఇరువైపులా నిలిపి వేస్తున్నారు. విద్యార్థులు, ఉదయం సాయంత్రం వంతెన పై అటు ఇటు నడిచి వెళ్ళవలసిన పరిస్థితి ఎదురయింది. ఇది అదునుగా భావించిన ఆకతాయిలు, విద్యార్థినులను ఈవ్ టీజింగ్ చేయటానికి ప్రయత్నిస్తున్నారని రాజోలు సిఐ సురేష్ బాబు దృష్టికి వచ్చింది. వెంటనే స్పందించి, సిఐ శనివారం విద్యార్థులు వంతెన పై వెళ్లే సమయానికి అక్కడకు చేరుకున్నారు. పరిసరాలను పరిశీలించారు. ఈవ్ టీజింగ్ చేసే వారిపై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విద్యార్థినిలకు నా అసౌకర్ ణ వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. వంతెన ప్రాంతంలో గట్టి బందోబస్తు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. దీంతో ఆకతాయిలు తోకముడిచారు.