Telugu News Power

రొయ్యల ఫీడ్ ధర పెంపుకు వ్యతిరేకంగా రెవెన్యూ కార్యాలయాల్లో వినతి పత్రాలు ఇవ్వాలి.

సమావేశంలో మాట్లాడుతున్న గాంధీ భగవాన్ రాజు

-రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు పిలుపు.

పాలకొల్లు: జూన్ 15 (తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్రంలో ఆక్వా రైతులు రొయ్యల దాణా ధర పెంపుకు నిరసనగా, శాంతియుతంగా వినతి పత్రాలు అందించాలని పిలుపునిచ్చారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయాల్లో, ఆర్డిఓ, కలెక్టర్ కార్యాలయాల్లో రైతులు వినతి పత్రాలు అందించాలని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు పిలుపునిచ్చారు. ఈ మేరకు సోమవారం జరిగిన సమావేశంలో రైతులు ఈ నిర్ణయం ప్రకటించారు. వ్యవసాయ శాఖ మాత్యులు కింజరపు అచ్చం నాయుడు వారం రోజుల గడువు కోరారని, అంతవరకు శాంతియుతంగా ఉద్యమం xచేయాలని సూచించారు. భారీగా పెంచిన ఫీడ్ ధర రైతులకు ఆమోదయోగ్యం కాదన్నారు. ఫీడ్ కంపెనీలు ఏకపక్షంగా రేట్లు పెంచి గుత్తాధిపత్యాన్ని చెలా ఇస్తున్నాయని విమర్శించారు. వారం రోజుల తర్వాత పెంపును ఉపసంహరించుకోకపోతే, ఉద్యమాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో, మేడిది జాన్ డేవిడ్ రాజు, మేక ఫణీంద్ర ప్రసాద్, పెనుమత్స సత్యనారాయణ రాజు, శ్రీను రాజు తదితరులు పాల్గొన్నారు.