Skip to main content

Telugu News Power

మండల పరిషత్ సమావేశం.

మండల పరిషత్ సమావేశ ంలో నడుస్తున్న ఎంపీపీ ధనలక్ష్మి

యలమంచిలి:జూలై,24
( తెలుగు న్యూస్ పవర్. కామ్) మండల పరిషత్ సమావేశం మండల అధ్యక్షురాలు వినుకొండ ధనలక్ష్మి రవికుమార్ అధ్యక్షతన శుక్రవారం స్థానిక సమావేశ మందిరంలో జరిగింది. ఇన్చార్జి మండల అభివృద్ధి అధికారి జెడివి ప్రసాద్ ఆధ్వర్యంలో ఈ సమీక్ష సమావేశం నిర్వహించారు. మండలంలో జరుగుతున్న పలు అభివృద్ధి పథకాల అమలు తీరును ఎంపీపీ సమీక్షించారు. పనులు వేగవంతం చేయవలసిందిగా సూచించారు. ఈ సమావేశంలో, మాజీ ఎంపీపీ రావూరి వెంకటరమణ మురళి, చిలుకూరి రాజ్యలక్ష్మి శ్రీనివాస్, జిల్లెల్ల రత్నం రాజు, గౌరు నాగలక్ష్మి, తదితరు లు సర్పంచులు, కార్యదర్శులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.