పాలకొల్లు: జూలై, 24( తెలుగు న్యూస్ పవర్. కామ్)పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో శ్రీ పార్వతీ దేవి అమ్మవారు, శ్రీలక్ష్మి దేవి అమ్మవార్లకు ఆషాడ మాసం సందర్భముగా శాఖంబరి అవతారంతో శుక్రవారం అలంకరించారు ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి (కిష్టప్ప), వివిధ రకములైన కూరగాయలతో పలు రకాల పండ్లతో అలంకరణ చేసారు. దేవేరుల శాకాంబరి అలంకరణ చూసి భక్తులు తన్మయులై, ఆధ్యాత్మిక ఆనందానుభూతి పొందారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.
పెద గోపురంలో దేవేరులకు శాకంబరీ అలంకరణ.
పార్వతీ మాత, లక్ష్మీదేవి శాకాంబరి అలంకరణ.