భోగాపురం: జూలై,24( తెలుగు న్యూస్ పవర్. కామ్) దశాబ్దాలకు ఎదురుచూస్తున్నాను ఉత్తరాంధ్ర ప్రజల కల నెరవేరబోతుందని, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు శుక్రవారం తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలతో రూ.4,592 కోట్లతో ఈ గ్రీన్ ఫీల్డ్ విమానాశ్రయం నిర్మించినట్టు వెల్లడించారు. సుమారు 2,203 ఎకరాల సుశాల ప్రాంతంలో విమానాశ్రయం ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ విమానాశ్రయం 3,800 మీటర్ల పొడవవైన రన్వే కలిగి ఉందన్నారు. ఇక్కడ కార్గో టెర్మినల్ అందుబాటులో ఉంటుందన్నారు. ఏవియేషన్ యూనివర్సిటీ స్థాపిస్తామని వెల్లడించారు. ఈ విమానాశ్రయంలో ఎమ్మార్వో సౌకర్యం కూడా ఉందన్నారు. విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు ఏర్పోర్ట్ సముద్రంలో ఉందన్నారు. ఈ ప్రాంతంలో వాణిజ్య,పర్యాటక రంగాలు అభివృద్ధి చెంది ఉపాధికి బాటలు వేస్తుందన్నారు. ఉత్తరాంధ్ర ప్రగతికి ఈ విమానాశ్రయం ఎంతగానో తోడ్పడుతుందన్నారు.
ప్రారంభోత్సవానికి సిద్ధమైన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం.
భోగాపురం ఎయిర్పోర్ట్ దృశ్యం