
స్మశాన వాటిక సౌకర్యాల కోసం మంత్రి ఆధ్వర్యంలో మెగా శ్రమదానం.
ఓఎన్జిసి సిఎస్ఆర్ నిధులు రూ. 80 లక్షలతో పనులు.
పోడూరు: జూలై, 26( తెలుగు న్యూస్ పవర్. కామ్) గత రెండేళ్లుగా, స్మశాన వాటిక లపై ప్రజలకు ఉన్న అపోహలు తొలగించి, అవగాహన కల్పిస్తున్నామని, అందువల్లే నేడు మహిళలు కూడా స్మశాన స్థలానికి వచ్చి సమాధానం చేస్తున్నారని, స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జల వనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. మండలంలోని పెద్దదైన స్థానిక పెనుమదం స్మశాన వాటిక సౌకర్యాల కల్పన పనులు ఆదివారం మంత్రి ఆధ్వర్యంలో శ్రమదానంతో ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఆఖరి మజిలీ ప్రాంతం పరిశుభ్రంగా, ఆరోగ్యవంతమైన వాతావరణం లో ఆహ్లాద పరిచే విధంగా ఉండాలని సంకల్పంతో నియోజకవర్గాల్లో స్మశాన వాటిక తీర్చిదిద్దుతున్నట్లు మంత్రి తెలిపారు. పుట్టుకప్పుడు చేసిన స్థానం గుర్తుండదని, పోయేటప్పుడు చేసిన స్నానం మనకు తెలియదని ఈ రెండిటి మధ్య ఉన్న నీటి బుడగ జీవితం కోసం తాపత్రయం తగదని హితువు పలికారు. మనం ఎంత సంపాదించినా, చేసిన మంచి పనులు మాత్రమే మిగిలి ఉంటాయని బోధ చేశారు. ఓఎన్జిసి సంస్థ వారి మెగా సి ఎస్ ఆర్ నిధులు రూ. 80 లక్షలతో ఈ పనులు ప్రారంభించినట్టు వెల్లడించారు. తమస్తులు ఏకతాటి పైకి వచ్చి స్మశాన వాటిక సౌకర్యాల కల్పనలో శ్రమదానం చేయటం పట్ల మంత్రి వారికి అభినందనలు తెలియజేశారు. మంత్రి ఉదయాన్నే నుంచి సాయంత్రం వరకు జరిగిన శ్రమదాన కార్యక్రమాల్లో కాంక్రీట్ గోడ నిర్మాణం త్వరలో పాల్గొని గ్రామస్తులను ఉత్సాహపరిచి, వేగవంతం చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి నాయకులు, గ్రామ ప్రముఖులు, యువకులు, మహిళలు, రైతులు శ్రమదానం చేశారు.
