భీమవరం:జూలై, 26(తెలుగు న్యూస్ పవర్. కామ్) జీవితంలో విద్య అనేది అత్యంత శక్తివంతమైన ఆయుధమని, ఇది జ్ఞానాన్ని అందించడమే కాక సమాజంలో మంచి స్థితిని, వ్యక్తిగత వికాసాన్ని ఇస్తుందని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్ ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) అన్నారు. భీమవరం రైతు బజార్ వెనుక ప్రభుత్వ బాలికల హాస్టల్ లోని 90 మంది విద్యార్థులకు ఆదివారం రగ్గులు, స్వేటర్స్, టర్కీ టవల్స్, నైట్ డ్రెసెస్ లను ఎమ్మెల్యే అంజిబాబు అందించారు. ఈ సందర్భంగా, మాట్లాడుతూ,విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని, విద్యార్థులు ఉన్నత స్థాయికి ఎదిగి సమాజానికి పాటు పడాలన్నారు. విద్యార్థులు బాగా చదువుకుని అన్ని రంగాలలో రాణించాలని, వారికి కావాల్సిన సౌకర్యాలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందన్నారు. లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఆ దిశగా ప్రయత్నించాలని సూచించారు. విద్యార్థులకు ప్రభుత్వ అందజేసిన విద్యా సామాగ్రిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏకాగ్రతతో చదివి మంచి మార్కులు సాధించాలని, ఉన్నత స్థాయికి చేరుకోవాలని సూచించారు. అనంతరం 90 మంది హాస్టల్ విద్యార్థులకు రగ్గులు, స్వేటర్స్, టర్కీ టవల్స్, నైట్ డ్రెసెస్ లను లను ఎమ్మెల్యే అంజిబాబు చేతుల మీదుగా అందించారు. కార్యక్రమంలో రాష్ట్ర కృష్ణ బలిజ కార్పొరేషన్ చైర్మన్ గంటా త్రిమూర్తులు, మైనార్టీ కార్పోరేషన్ డైరెక్టర్ షబీనా బేగం, వవిలిశెట్టి రామకృష్ణ, కొప్పినిడి శ్రీనివాస్, రెడ్డి సత్తిబాబు, మదాసు కనకదుర్గ, శేఖర్, శ్రీనివాస్, మాగపు ప్రసాద్, కాపా అమర్ బాబు, నల్లం గంగాధర్ రావు హాస్టల్ వార్డెన్, సిబ్బంది కూటమి నాయకులు కార్యకర్తలు అభిమానులు వీర మహిళలు తెలుగు మహిళలు పాల్గొన్నారు.
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు -ఎమ్మెల్యే అంజిబాబు.
విద్యార్థులకు దుస్తులు అందజేస్తున్న ఎమ్మెల్యే అంజిబాబు