Skip to main content

Telugu News Power

పెద గోపురం మాడవీధుల్లో సప్త ప్రదక్షిణలు.

సప్త ప్రదక్షిణలలో పాల్గొన్న భక్తులు

పాలకొల్లు: జూలై 27, ( తెలుగు న్యూస్ పవర్.. కామ్)
పట్టణంలో వేంచేసి ఉన్న శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి దేవస్థానం వద్ద సోమవారం సాయంత్రం మారేడు దళములతో మాడవీధుల్లో భక్తులు సప్త ప్రదక్షిణాలు చేశారు. భక్తులు సుమారు 350 మంది పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు, సూపరింటెండెంట్ పి . వాసు, ఆలయ ప్రధాన అర్చకులు సన్నిధి రాజు రామకృష్ణమూర్తి (కిష్టప్ప) ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాత్రి స్వామివారికి పంచ హారతులు, ధూప సేవ కార్యక్రమం నిర్వహించారు.