Skip to main content

Telugu News Power

దస్తావేజులేఖర్లకు వైసీపీనాయకులు సంఘీభావం

లేఖర్ల నిరసన శిబిరం వద్ద వైసీపీ నాయకులు

పాలకొల్లు: జూలై, 29( తెలుగు న్యూస్ పవర్. కామ్) ప్రభుత్వం కొత్తగా తెచ్చిన జీవో 396ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ పాలకొల్లులో క్షీరపురి దస్తావేజు లేఖర్ల సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన పెన్ డౌన్ కార్యక్రమం 10వ రోజుకి చేరింది. ఈ సందర్భంగా,వైసీపీ నాయకులు బుధవారం లేఖర్ల నిరసన దీక్ష శిబిరం వద్ద సంఘీభావం తెలిపారు. లేఖర్ల వ్యవస్థను ప్రభుత్వం నిర్వీర్యం చేయాలని చూడటం దారుణమని, వెంటనే జీవోను రద్దు చేయాలని వైసీపీ నేతలు మేకా శేషుబాబు, యడ్ల తాతాజీలు డిమాండ్ చేశారు. వేలాదిమంది తరతరాలుగా ఈ వృత్తినే నమ్ముకుని బ్రతుకు తున్న వారి వృత్తిని దెబ్బతీసేలా, పరిస్థితి ఉందని ఆరోపించారు. మేకలు ఇచ్చిన గొడవ లోపల ప్రభుత్వం స్పందించకపోతే, వచ్చేనెల ఐదున గోపాలపురం పర్యటన లో మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి మేకల సమస్య కోసం ప్రస్తావిస్తామని శేషు బాబు తెలిపారు. ఈ కార్యక్రమంలో, కోరాడ శ్రీనివాస్, కావలి సోమేశ్వరరావు, జోగాడా ఉమామహేశ్వర రావు, తదితరులు పాల్గొన్నారు. సంఘం అధ్యక్షులు వెంకటేశ్వర్లు తమ డిమాండ్లతో కూడిన వినతి పత్రాలు వైసిపి నాయకులకు అందజేశారు.