Skip to main content

Telugu News Power

యలమంచిలిలో ఘనంగా గురు పూర్ణిమ.

గురు పౌర్ణమి సందర్భంగా సాయిబాబా ఆలయంలో పూజలు
భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ.

యలమంచిలి: జులై,29
(తెలుగు న్యూస్ పవర్.కామ్) స్థానిక పెదరామాలయం వద్దు గల ఉపాలయంలో వేంచేసి ఉన్న శ్రీ సాయి బాబా మందిరంలో గురు పౌర్ణమి సందర్భంగా, బుధవారం విశేష అభిషేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో, ఎన్నారై చిలుకూరి రాంప్రసాద్ (రాము) పాల్గొని పూజలు నిర్వహించారు. భక్తులు, విశేషంగా మహిళా భక్తులు గురు పూర్ణిమ సందర్భంగా, సాయిబాబా పారాయణం చేశారు. ఆలయ అర్చకులు వాడపల్లి గోపి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా, సుమారు 1200 మంది భక్తులకు అన్నదాన ప్రసాద వితరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో చిలుకూరి వెంకటేశ్వరరావు,అంతర్వేది కమిటీ అధ్యక్షులు తాళ్లూరి శ్రీనివాస చక్రవర్తి, చేకూరి సత్యనారాయణ, తాళ్లూరి సోమేశ్వర రావు, తమ్మినీడి విష్ణుమూర్తి, దేవస్థానం చైర్మన్ చిలుకూరి ఆంజనేయులు, సొసైటీ అధ్యక్షులు బొప్పన హరికిషోర్, మాజీ ఎంపీపీ బొప్పున సుజాత, బొప్పన సురేష్, బొప్పన శ్రీనివాస్, కనగర్ల సుబ్బారావు, సిద్ధాని రాము, తాళ్లూరి ప్రసాద్, చిలుకూరి శ్రీనివాస్, చిలుకూరి ఆంజనేయులు, నాని తదితరులు పాల్గొన్నారు.