Skip to main content

Telugu News Power

గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఉద్యమిస్తాం. -ఆక్వా రైతు సంఘం హెచ్చరిక.

పాలకొల్లు: జులై, 30( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఆక్వా రైతు సమస్యల పరిష్కారం కోసం దశలవారీగా ఉద్యమం చేస్తామని రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు వెల్లడించారు. రాష్ట్రస్థాయి కార్యవర్గ సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా భగవాన్ రాజు మాట్లాడుతూ, ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళతామని తెలిపారు. రాష్ట్రస్థాయి ఆక్వా రైతు సంఘం సభ కోనసీమ జిల్లా నుంచి ప్రారంభించి, రాష్ట్ర రాజధాని అమరావతికి, అక్కడ నుంచి దేశ రాజధాని ఢిల్లీ జంతర్ మంతర్ వరకు తమ డిమాండ్ల పరిష్కారం కోసం ఉద్యమిస్తామని హెచ్చరించారు. ప్రభుత్వం ఆక్వా రైతులకు ప్రకటించిన విద్యుత్ సబ్సిడీ ఈరోజు కూడా అమలు కాకపోవటం పట్ల విచారం వ్యక్తం చేశారు. రైతులకు మే నెల నుంచి సబ్సిడీ వర్తింపు చెయ్యాలని విజ్ఞప్తి చేశారు. రొయ్యల కౌంట్ 30 కు కనీస మద్దతు ధర
రూ. 550 లు, 40 కౌంట్ ధర రూ.490 లు ఉండేలా ప్రభుత్వం ప్రకటించాలని కోరారు. రొయ్యల రేటు, దాణా రేటు మధ్య దామాషా పద్ధతిలో పెంచడానికి ప్రభుత్వం మధ్య మధ్యవర్తిత్వం వహించాలని కోరారు. వాతావరణం ప్రభావం వల్ల వైరస్ బారిన పడి ఇప్పటికే రైలు రైతులు భారీగా నష్టాలు చదువు చూశారని సమావేశంలో ఆందోళన వ్యక్తం చేశారు. జీఎస్టీ తక్షణమే ఏదో శాతానికి తగ్గించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం సీడు, ఫీడు, ప్రాసెసింగ్ యూనిట్లతో చర్చలు జరిపి రైతులకు సానుకూల పరిస్థితులు కల్పించాలని, అందుకు తాము చర్చించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. ఈ సమావేశంలో స్థానిక సంఘ అధ్యక్షులు బోనం చినబాబు, కొటికలపూడి కృష్ణ శ్రీ, సత్తినీడి వెంకటేశ్వరరావు, పెనుమత్స వెంకట సత్యనారాయణ రాజు, మేడిది జాన్ డేవిడ్ రాజు, మంతెన ఆనంద గజపతి రాజు,యాళ్ల వెంకటానందం, డి సత్యనారాయణ రాజు, శ్రీహరి వర్మ, కాకర్ల వినాయక్ ఈ సమావేశంలో పాల్గొన్న.