రాష్ట్రంలో వర్షాలు సమృద్ధిగా వర్షాలు కురిసి, పంటలు దండిగా పండి, రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, లోక కళ్యాణార్థం స్థానిక శాసన సభ్యులు, జలవనరుల శాఖామాత్యులు, నిమ్మల రామానాయుడు, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆదేశములు మేరకు శ్రీ స్వామివారికి జలాభిషేకం పూజలు శుక్రవారం ఉదయం ప్రారంభమయ్యాయి. ప్రతిరోజు ఉదయం నుంచి రుద్ర గాయత్రీ జపములు, నమకం, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకములు, అభిషేకములు జరుగు ఈ ఏకాదశ క్రతువులో అభిషేక పండిట్లు అర్చకులు , రుత్వికులతో విశేషపూజలు నిర్వహిస్తారు. ఉదయం ఆలయ చైర్మన్ మీసాల రామచంద్ర రావు జలాభిషేకం కలశ స్థాపన పూజలు శుక్రవారం ప్రారంభించారు. కలశ స్థాపన పూజ అభిషేక పండితులు బమిడి పాటి వెంకన్న , మద్దూరు సూరిబాబు, ఆలయ ప్రధాన అర్చకులు అనిల్, కృష్ణప్ప , అర్చకులు వీరబాబు, పదిమంది అర్చకులతో కలశ స్థాపన పూజ జరిగింది. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, ఆలయ ధర్మకర్తలు నాళము నాగ వెంకట సురేఖ, హోతా ప్రవాలిళీ, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.
శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారికి జలాభిషేక పూజలు ప్రారంభం.
కలశ స్థాపన పూజలో పాల్గొన్న చైర్మన్ రాము, ఈవో శ్రీనివాస రావు.