Skip to main content

Telugu News Power

ఉత్తరాంధ్ర ప్రగతికి సరికొత్త మైలురాయి: భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం. ప్రధాని మోదీచే నేడు ప్రారంభం.

ప్రధాని మోడీ ప్రారంభించే భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం
భోగాపురం ఎయిర్పోర్ట్ బాహ్య చిత్రం

విజయనగరం / అమరావతి: జూలై, 31( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉత్తరాంధ్ర ప్రాంత ఆర్థిక ప్రగతిని మలుపు తిప్పే ప్రతిష్ఠాత్మక ‘అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయాన్ని’ (భోగాపురం ఎయిర్పోర్ట్) భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శనివారం జాతికి అంకితం చేస్తారు. విజయనగరం జిల్లా భోగాపూర్ వద్ద పబ్లిక్-ప్రైవేట్ పార్టనర్‌షిప్ (పీపీపీ) పద్ధతిలో జిమ్మెర్ గ్రూప్ దాదాపు రూ.5,640 కోట్ల భారీ వ్యయంతో ఈ ప్రాజెక్టును నిర్మించింది.
​ఈ సందర్భంగా విమానాశ్రయంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా మొత్తం రూ. 17,800 కోట్లకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధాని ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారు.
ముఖ్యాంశాలు: సుమారు
​రూ.17,800 కోట్ల ప్రాజెక్టుల వరాలు: విమానాశ్రయంతో పాటు విశాఖ జిల్లా తర్లువాడలో రూ.468 కోట్లతో నిర్మించనున్న ‘ఏఎస్‌ఐపీ (అసిప్ ) సెమీకండక్టర్ ప్యాకేజింగ్ యూనిట్’కు, అలాగే రూ.5,550 కోట్ల వ్యయంతో చేపట్టే పవర్ గ్రిడ్ ట్రాన్స్‌మిషన్ ప్రాజెక్టులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారు.
​43 ఏళ్ల తర్వాత చారిత్రక ఘట్టం: విజయనగరం జిల్లా నేలపై ఒక దేశ ప్రధాని పర్యటించడం దాదాపు 43 సంవత్సరాల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం.
​గిన్నిస్ రికార్డ్ దిశగా సాంస్కృతిక వేడుక: ఉత్తరాంధ్ర సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పేలా 13,500 మంది గిరిజన కళాకారులతో నిర్వహించిన ‘థింసా నృత్య ప్రదర్శన’ విశేషంగా ఆకట్టుకుంది.
​ప్రత్యేక ఆకర్షణ (30,000 మొక్కల స్వాగతం): ఆకాశం నుంచి ల్యాండ్ అయ్యే విమానాల ప్రయాణికులకు కనిపించేలా దాదాపు 30,000 లైవ్ ప్లాంట్స్‌తో (జపనీస్ బర్నింగ్ బుష్ గ్రాస్) స్వాగత సందేశాన్ని తీర్చిదిద్దారు. X భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రత్యేకతలు:
​1. ఆకట్టుకునే సాంస్కృతిక డిజైన్
​చిరుతిల్లు, అరకు లోయల ప్రతిబింబం: విమానాశ్రయ రూర్ ప్రొఫైల్‌ను స్థానిక తీరప్రాంత ‘చుట్టిల్లు’ (సర్కులర్ కాటజెస్ ) డిజైన్ మరియు అరకు లోయల అందాల ప్రేరణతో రూపొందించారు.
​ఎగిరే చేప ఆకృతి: సముద్రతీర సౌందర్యాన్ని ప్రతిబింబించేలా భవన బాహ్య ఆకారాన్ని ‘ఫ్లయింగ్ ఫిష్’ మోడల్‌లో రూపొందించగా, లోపలి సీలింగ్‌పై తెలుగు సాంప్రదాయ రంగుల రంగవల్లుల (రంగుల ముగ్గుల) శైలిని పొందుపరిచారు.
​2. అత్యాధునిక మౌలిక వసతులు
సౌకర్యంవివరాలు
కోడ్ 4ఈ రన్‌వేబోయింగ్ 777, ఎయిర్‌బస్ ఏ 330 వంటి భారీ వైడ్-బాడీ విమానాలు దిగేందుకు వీలుగా 3,800 మీటర్ల రన్‌వే.
ప్రయాణికుల సామర్థ్యంతొలి దశలో ఏటా 6 మిలియన్ల (60 లక్షల) ప్రయాణికులకు సేవలు. భవిష్యత్తులో దీనిని 40 మిలియన్లకు విస్తరించే అవకాశం.
స్మార్ట్ ఎయిర్‌పోర్ట్ టెక్నాలజీడిజియాట్రా (బయోమెట్రిక్ ప్రాసెసింగ్ ), ఏ ఐ -ఆధారిత ప్రెడిక్టివ్ ఆపరేషన్స్ (అపోక్ ), ఆటోమేటెడ్ లగేజ్ హ్యాండ్లింగ్ సిస్టమ్.
కార్గో & కోల్డ్ స్టోరేజ్ఏడాదికి 25,000 మెట్రిక్ టన్నుల సరుకు రవాణా సామర్థ్యం. విశాఖ పరిసరాల ఫార్మా, సీఫుడ్ ఎగుమతులకు వీలుగా ప్రత్యేక కోల్డ్ స్టోరేజ్.
3. పర్యావరణ రక్షణ – గ్రీన్ ఎయిర్‌పోర్ట్
ఎల్ ఈ ఈ డి ప్లాటినమ్ రేటింగ్: ఈ ఎయిర్‌పోర్ట్‌ను పర్యావరణ అనుకూల గ్రీన్ బిల్డింగ్ ప్రమాణాలతో నిర్మించారు.
​సోలార్ విద్యుత్: సొంతంగా 5 మెగావాట్ల సోలార్ పవర్ ప్లాంట్, వర్షపు నీటి పునరుపయోగం, 30 శాతం రీసైకిల్డ్ నీటి వినియోగ వ్యవస్థలు అందుబాటులో ఉన్నాయి.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని విజయవంతం చేయటానికి గత కొన్ని రోజులుగా మునిసిపల్ శాఖ మాత్యులు వి నారాయణ ఆధ్వర్యంలో మంత్రులు, ఎంపీలు ఎమ్మెల్యేలు, పార్టీ వర్గాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి. ప్రజలను తరలించడానికి ఐదువేల బస్సులు సిద్ధం చేశారు. ఉత్తరాంధ్ర చరిత్రలో విజయనగరం జిల్లాలో ఈ ఘట్టం నవ్వుతూ నభోశతి అన్న విధంగా జరగబోతుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమా న్ని నిరంతరం పర్యవేక్షిస్తూ మార్గదర్శనం చేశారు.