పాలకొల్లు:ఆగష్టు,4
(తెలుగు న్యూస్ పవర్. కామ్)
కేవీఎం ఛాంబర్స్ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు, పాలకొల్లు పట్టణానికి చెందిన శ్రీ రేపాకవారి సత్రం, శ్రీ క్షీరపురి అన్నదానసమాజం, శ్రీ మన్యం జగ్గమ్మగారి సత్రం ధర్మకర్తల మండలి సహకారంతో
విద్యార్థులకీ ఒక జత బహుకరించారు. ఈ దుస్తులు 450 మందికి అందజేసారు.
ఈ కార్యక్రమంలో ధర్మకర్తల మండలి అధ్యక్షులు, ధర్మకర్తలు, రేపాకవారి సత్రం రేపాక కృష్ణకుమారి, శ్రీ క్షీరపురి అన్నదానసమాజం, తెలనాకుల కోటేశ్వరరావు, శ్రీ మన్యం జగ్గమ్మగారి సత్రం, మండాది అవినాష్, విద్యార్థులకు ఏకరూప దుస్తులు ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా దాతలు మాట్లాడుతూ ఛాంబర్స్ కళాశాలలో విద్యార్థులు విద్యలో అత్యుత్తమ ప్రతిభను కనబరుస్తూ ప్రతి సంవత్సరం రాష్ట్రస్థాయిలో, జిల్లా స్థాయిలో, పట్టణ స్థాయిలో అత్యున్నత రాంకులను సాధిస్తూ పాలకొల్లు పట్టణానికి వన్నె తెస్తున్నారని ప్రశంసించారు. ఈ సందర్బంగా, విద్యార్థులు, వారి తల్లిదండ్రులు దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. కళాశాల అధ్యక్షలు కారుమూరి కృషికి పట్ల హర్షం వ్యక్తం చేసారు.కళాశాల ఛైర్మన్, కారుమూరి వేంకట రత్న నరసింహారావు అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో సత్రాల ట్రస్ట్ బోర్డు సభ్యులు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లు, పట్టణ ప్రముఖులు, కళాశాల సెక్రటరీ,కరస్పాండెంట్ కె. వి. సీతారామరాజు, ట్రెజరర్ రేపాక ప్రవీణ్ భాను, అకడమిక్ అడ్వైజర్లు డా ఎ బి ఎస్ మూర్తి, నందుల సీతారామారావు, ప్రిన్సిపాల్ డాక్టర్ డి వేంకటేశ్వరరావు, వైస్ ప్రిన్సిపాల్ బి. విజయలక్ష్మి అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు.
ధర్మకర్తల ఔదార్యం తో ఛాంబర్స్ విద్యార్థులకు ఉచిత ఏకరూప దుస్తుల పంపిణీ.
విద్యార్థులకు ఏకరూప దుస్తుల పంపిణీ