Skip to main content

Telugu News Power

రైల్వే సర్వీసుల పునరుద్ధరణ కోసం గోదావరి జిల్లాల ప్రజల తరుపున కేంద్ర మంత్రివర్యులు వర్మ కు వినతి.

న్యూఢిల్లీ:ఆగష్టు, 5( తెలుగు న్యూస్ పవర్.కామ్) కేంద్ర ఉక్కు,భారీ పరిశ్రమల శాఖ సహాయ మంత్రివర్యులు, స్థానిక పార్లమెంట్ సభ్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఢిల్లీ క్యాంప్ కార్యాలయంలో గోదావరి జిల్లాల రైల్వే సమస్యలపై ప్రతినిధి బృందం వినతిపత్రం సమర్పించారు.
రైల్వే అధికారుల సమాధానం పట్ల ప్రజల ఆవేదన మంత్రి దృష్టికి తీసుకు వెళ్లారు.
నరసాపురం-విశాఖపట్నం రెగ్యులర్ ట్రైన్ పునరుద్ధరణ గురించి అడిగినప్పుడు మెయిన్ లైన్ లో కొత్తగా రేకులు వేస్తున్నాము. అవి పూర్తయ్యాక చూద్దాం. ఇప్పుడు 100 ట్రైన్స్ బదులు 120-130 ట్రైన్స్ నడుస్తున్నాయని చెప్పి అధికారులు పట్టించుకోవటం లేదని తెలిపారు.
గోదావరి జిల్లాల ప్రజల సౌకర్యార్థం ఈ డిమాండ్లను మంత్రికి సమర్పించారు. కోవిడ్ లో రద్దైన నరసాపురం-విశాఖపట్నం రెగ్యులర్ ఎక్స్‌ప్రెస్ ను వెంటనే పునరుద్ధరించాలి.
ప్రత్యామ్నాయంగా సింహాద్రి ఎక్స్‌ప్రెస్ ను భీమవరం టౌన్ మీదుగా నడపాలి. దీనివల్ల లక్షలాది మంది ప్రయాణికులకు సౌకర్యంగా ఉంటుంది. రైల్వే రద్దీ కూడా తగ్గుతుంది.
ఏటా వేలాది మంది వెళ్లే కాశి-అయోధ్య యాత్రకు నరసాపురం నుండి నేరుగా ఎక్స్‌ప్రెస్ నడపాలి. దీనితో పాటు నిమ్మ, కొబ్బరి, చేప, రొయ్యలను ఉత్తరాదికి నేరుగా పంపే అవకాశం ఉంటుంది.
గోదావరి జిల్లాల్లోని రైల్వే స్టేషన్ల ఆధునికీకరణ చేపట్టాలి.
ఈ వినతిపత్రాన్ని కేంద్ర మంత్రివర్యులు భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్, రైల్వే బోర్డ్, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్, విజయవాడ డి ఆర్ ఎం కు పంపించినట్టు తెలిపారు.గోదావరి జిల్లాల ప్రజల చిరకాల కోరికలను కేంద్ర మంత్రివర్యులు సానుభూతితో పరిశీలించి త్వరితగతిన పరిష్కరించాలని కోరారు.
ఈ ప్రతినిధి బృందంలో సభ్యులు జక్కంపూడి లక్ష్మీనరసింహ నాగేంద్ర కుమార్, కొల్లికొండ ప్రసాద్, అడపాల శివ సురేంద్ర, శ్రీమతి అల్లూరి పద్మ, అవిన్. పాల్గొన్నారు.