పాలకొల్లు: సెప్టెంబర్, 11 ( తెలుగు న్యూస్ పవర్. కామ్)
స్థానిక బి ఆర్ ఆర్ అండ్ జి కే ఆర్ చాంబర్స్ డిగ్రీ, పీజీ కళాశాలలో శుక్రవారం హెచ్ఐవి లేదా ఎయిడ్స్ పై విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి పాలకొల్లు ఐసిటిసి ఆరోగ్య కేంద్రం నుండి హెచ్ఐవి లేదా ఎయిడ్స్ కౌన్సిలర్ వి. సోమేశ్వరి, కే. ఉమాదేవి, జోనల్ సూపర్వైజర్ మరియు కే. సత్యవతి పి సురేష్ బాబులు ఈ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.
వి. సోమేశ్వరి మాట్లాడుతూ, నివారణ లేని, నేడు ప్రపంచమంతా భయపడే వ్యాధి ఎయిడ్స్ అని ఈ వ్యాధి సాధారణంగా విచ్చలవిడి శృంగారం, సురక్షితం గాని రక్తమార్పిడి,బార్బర్ షాపుల ద్వారా , సురక్షితమైన నీడిల్స్ వాడకపోయినా తల్లి నుండి పిల్లలకు సంక్రమిస్తుందని నేడు యువత డ్రగ్స్ మత్తులో పడి సామాజిక మత్తు ఇంజక్షన్స్ గుచ్చుకొనడం ద్వారా ఏ ఒక్కరిలో హెచ్ఐవి ఉన్నా మిగతా వారికి ఈ వ్యాధి సంక్రమిస్తుందని అందుచేత విద్యార్థులు డ్రగ్స్ కి దూరంగా ఉండాలని నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు ద్వారా హెచ్ఐవి లేదా ఎయిడ్స్ తగ్గుముఖం పట్టేటప్పటికీ 2030 నాటికి ఎయిడ్స్ రహిత దేశంగా మార్చాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కళాశాలలో ఈ అవగాహన సదస్సులు నిర్వహించారన్నారు.
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ డి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, ఈ అవగాహన కార్యక్రమంలో హెచ్ఐవి లేదా ఎయిడ్స్ పై తమ అనుమానాలు నివృత్తి చేసుకొని ఆరోగ్యకరమైన జీవనాన్ని భవిష్యత్తులో గడపడానికి దోహదపడుతుందన్నారు. విద్యార్థులు హెచ్ఐవి లేదా ఎయిడ్స్ పై వేసిన ప్రశ్నలకు రిసోర్స్ పర్సన్స్. సమాధానాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ అధికారులు ఎన్. రాంబాబు రంజిని, అధ్యాపకులు ఎన్. రవికుమార్ యు. జానకిరామయ్య, ప్రసన్న నాగదేవి, విజయలక్ష్మి తదితరులు, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
ఎయిడ్స్ పై ఛాంబర్స్ విద్యార్థులకు అవగాహన సదస్సు
అవగాహన సదస్సులో పాల్గొన్న విద్యార్థినులు