పాలకొల్లు:సెప్టెంబర్,12
(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక రైల్వే గేట్ వద్ద గల చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వినాయక చవితి సందర్భంగా, 500 మట్టి గణపతులు శనివారం ఉచిత పంపిణీ చేసారు. ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాలకొల్లు పట్టణ తెలుగుదేశం అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు విచ్చేసి మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని .ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చవాకల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చవాకుల సూర్య నరేష్ బాబు మహిళలకు కుట్టు మిషన్లు, విద్యార్థులకు పుస్తకాలు, కార్తీక మాసంలో పంచారామ క్షేత్రానికి వచ్చే భక్తులకు అల్పాహారం, మెడికల్ క్యాంపులు, వేసవికాలంలో చలివేంద్రాలు వంటి ఎన్నో సేవా కార్యక్రమాలు స్వచ్ఛందంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ఈరోజు మట్టి గణపతి విగ్రహాలని పంచిపెట్టడం ముదావహం అన్నారు. ఈ కార్యక్రమంలో చవాకుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ అండ్ చైర్మన్ చవాకుల సూర్యనరేష్ బాబు, వంగ నరసింహారావు, నారిన ప్రతాప్ రామనాయుడు, సలాది సత్యనారాయణ, మండెల రజనీ, ధోని సత్యనారాయణ, దాసరి లక్ష్మీనారాయణ, మండెల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
చవితి వినాయక విగ్రహాలు పంపిణీ చేసిన చవాకుల ట్రస్ట్.
ఉచిత పంపిణీకి సిద్ధమైన మట్టి విగ్రహాలు