పాలకొల్లు: సెప్టెంబర్, 17( తెలుగు న్యూస్ పవర్. కామ్) భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రజా సేవ లో 25 ఏళ్ల రజితోత్సవం సందర్భంగా, స్థానిక కూటమి నాయకులు గురువారం ఆశీర్వాద దీపం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయ ప్రాంగణంలోని లీలా కళ్యాణ మండపంలో జ్యోతులు వెలిగించారు. ఈ సందర్భంగా, కూటమి నాయకులు మాట్లాడుతూ, ప్రపంచంలో భారత దేశ కీర్తి ప్రతిష్టలను మోడీ ఇనుముడింప చేశారని పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధికి సహాయ సహకారాలు అందిస్తున్న మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. దేశ సేవలో తరించడానికి మోడీకి భగవంతుడు ఆయురారోగ్యాలు ప్రసాదించి, ఆశీర్వదించాలని ఆకాంక్షించారు. బిజెపి పట్టణ అధ్యక్షులు కొల్లి కొండ ప్రసాద్ ఆధ్వర్యంలో ఆశీర్వాద దీపం కార్యక్రమం ఆనందోత్సవాలతో జరిగింది. ఈ కార్యక్రమంలో, మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, రాష్ట్ర టిడిపి కార్యదర్శి పెచ్చెట్టి బాబు, పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు, ఏఎంసి చైర్మన్, కోడి విజయభాస్కర్, పెదకూపురం చైర్మన్ మీసాల రామచంద్ర రావు, రాష్ట్ర బిజెపి నాయకులు ఉన్నమట్ల కపర్ది, జనసేన పార్టీ జిల్లా నాయకులు తులా రామలింగేశ్వర రావు, బిజెపి సీనియర్ నాయకులు రావూరి సుధా, జక్కంపూడి కుమార్, అల్లూరి పద్మ వర్మ, గవర పవన్ నాయుడు, యర్రంశెట్టి పద్మారావు, పెండ్యాల భవాని, కడలి గోపి ద నిద్ర పలువురు నాయకులు పాల్గొన్నారు.
ప్రజా సేవలో ప్రధాని మోడీ రజితోత్సవం. కృతజ్ఞతతో ఆశీర్వాద దీపం.
పెద గోపురంలో దీపోత్సవ దృశ్యం