పాలకొల్లు:,సెప్టెంబర్17
(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ ఏ.ఎస్.ఎన్.ఎం.(స్వయంప్రతిపత్తి), ప్రభుత్వ కళాశాల, జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసి) ప్లేస్మెంట్ సెల్ ఆధ్వర్యంలో దివిస్ లే్బొరెటరీస్ ప్రవేట్ లిమిటెడ్ సంస్థకు సంబంధించిన క్యాంపస్ డ్రైవ్‌ను బుధవారం నిర్వహించారు.ఈ సందర్భంగా, కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రత్న మాణిక్యం మాట్లాడుతూ, విద్యార్థులు తమ విద్యార్హతలకు అనుగుణంగా లభిస్తున్న ఉద్యోగ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో కేవలం విద్యార్హతలు మాత్రమే కాకుండా, సాంకేతిక పరిజ్ఞానం, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్య పరిష్కార సామర్థ్యం, టీమ్ వర్క్, వృత్తిపరమైన నైపుణ్యాలు ఎంతో అవసరమని పేర్కొన్నారు. ప్రముఖ సంస్థల్లో ఉద్యోగం పొందడం విద్యార్థుల కెరీర్‌కు మంచి ప్రారంభమని, ఉద్యోగంలో చేరిన తరువాత కూడా నిరంతరం కొత్త విషయాలను నేర్చుకుంటూ తమ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని ప్రిన్సిపాల్ కోరారు. కళాశాలలో అందిస్తున్న జేకేసి – ప్లేస్మెంట్ సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని, తమ ప్రతిభను నిరూపించుకోవాలని ఆకాంక్షించారు. ఎంపికైన విద్యార్థులకు అభినందనలు తెలియజేస్తూ, భవిష్యత్తులో వారు ఉన్నత స్థాయికి ఎదిగి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని కోరారు.
దివిఎస్ లబొరెటరీస్ సంస్థకు చెందిన హెచ్.ఆర్. రాజేష్ సంస్థ కార్యకలాపాలు, ఉద్యోగ అవకాశాలు, నియామక ప్రక్రియ, ఉద్యోగ బాధ్యతలు, సంస్థలో ఉన్న కెరీర్ అవకాశాల గురించి అభ్యర్థులకు వివరించారు. వివిధ దశల్లో ఎంపిక ప్రక్రియను నిర్వహించారు.ఈ క్యాంపస్ డ్రైవ్‌లో సుమారు 63 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఎంపిక ప్రక్రియలో 41 మంది ఉద్యోగాలకు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థులను కళాశాల ప్రిన్సిపాల్, అధ్యాపకులు మరియు సిబ్బంది అభినందించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ టి. కృష్ణ, ఐక్యూఏ సీ కోఆర్డినేటర్ డా. బి. వెంకటస్వామి, అకడమిక్ కోఆర్డినేటర్ జి. సుమలత, జేకేసీ కోఆర్డినేటర్ కె. శామ్యూల్, డాక్టర్ ఎం రామకృష్ణ,జి.డి. శ్రీనివాస్, ఎం.ఎల్.డి. శిరీష, డా. వి.డి.వి. విజయ లక్ష్మి, డీ మన్మధరావు తదితరులు పాల్గొని విద్యార్థులను అభినందించారు.
కళాశాల యాజమాన్యం తరఫున Divi’s Laboratories Pvt. Ltd. సంస్థ ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో JKC – ప్లేస్మెంట్ సెల్ చేస్తున్న కృషిని అభినందించారు.