పాలకొల్లు:సెప్టెంబర్,19( తెలుగు న్యూస్ పవర్. కామ్) ఉభయ గోదావరి ఉమ్మడి జిల్లాల ఉపాధ్యాయ నియోజకవర్గం నుంచి శాసనమండలికి పోటీ చేస్తున్న, ప్రస్తుత ఎమ్మెల్సీ, పిడిఎఫ్ అభ్యర్థి బొర్రా గోపి మూర్తి స్థానిక కళాశాలలో శనివారం ప్రచారం నిర్వహించారు. దాసరి నారాయణరావు మహిళా కళాశాల, శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ కళాశాల, కోకోనట్ మర్చంట్స్ బాలికల జూనియర్ కళాశాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులను కలిసి మద్దతు కోరారు. పిడిఎఫ్ పక్షాన ఉపాధ్యాయుల న్యాయమైన కోర్కెల సాధన కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల పర్యటనలో యు టి ఎఫ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జి వి వి రామానుజరావు, యుటిఎఫ్ జిల్లా పూర్వ కార్యదర్శి అంగర రామభద్రం, వి జగ్గారావు పాల్గొన్నారు.
ఎమ్మెల్సీ అభ్యర్థి గోపి మూర్తి ప్రచారం.