Skip to main content

Telugu News Power

Telugu News Power

ఏపీ పోలీస్ శాఖకు కేంద్ర పతకం.

విజయవాడ: మార్చి,17(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్. కు కేంద్ర ప్రభుత్వం వారు అంధించే ప్రతిష్టాత్మకమైన అతి ఉత్కృష్ట సేవా పతకం -2025 వరించింది. పోలీసు శాఖ లో అత్యంత ప్రతిభావంతంగా, నిష్కల్మషంగా, అంకితభావంతో, అత్యుత్తమ సేవలు అందించి, విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజల భద్రత, నేర నియంత్రణ వంటి అంశాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి విశిష్టమైన సేవలు అందించిన ఉత్తమ సేవలకు గాను ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు…

Read More

ఎంపీ నితిన్ నవీన్ అభినందించిన మంత్రులు.

న్యూఢిల్లీ: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ రాజ్యసభకు సోమవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సత్య కుమార్ లు నితిన్ నవీన్ మంగళవారం అభినందించి, సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మరింత ప్రోత్సాహం నితిన్ నాయకత్వంలో లభిస్తుందన్నారు….

Read More

రైతన్న నీకోసం” ప్రారంభించిన ఎమ్మెల్యే పులపర్తి, కలెక్టర్ నాగరాణి

రైతన్న నీకోసం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే అంజిబాబు, కలెక్టర్ నాగరాజు భీమవరం: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కాం)రైతన్నల ప్రయోజనాలను కాపాడుతూ, మరింత ఆర్థిక అభివృద్ధిని సాధించే దిశగా ప్రభుత్వం పథకాలు అమలు చేస్తుందని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి కోరారు. స్థానిక తాడేరు గ్రామంలో వీరభద్ర స్వామి దేవాలయం వద్ద వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో “రైతన్న నీకోసం” కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా,ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, ప్రభుత్వం రైతుల కోసం…

Read More

ఘనంగా ఏ.ఎస్.ఎన్.ఎం. ప్రభుత్వ కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకలు

                                                       వార్షికోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖులు పాలకొల్లు, మార్చి,17(తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణ మూర్తి (ఏ.ఎస్.ఎన్.ఎం.) ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల 59వ వార్షికోత్సవ వేడుకలు కళాశాల ప్రాంగణంలో అత్యంత వైభవంగా జరిగాయి. ఈ…

Read More

‘చిక్కాల’ కు ముఖ్యమంత్రి శుభాకాంక్షలు.

అమరావతి: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) చిక్కాల రామచంద్రరావు, ఆ పేరే చాలు, నీతి నిజాయితీలకు నిలువెత్తురూపం, అజాతశత్రువు, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సరళమైన జీవన విధానం, రాజనీతిజ్ఞుడు, ప్రజా సేవకుడు ఇంకెన్ని ఉపమానాలైనా ఆయన గురించి చెప్పుకోవచ్చు. చిక్కాల రామచంద్రరావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో తాళ్లరేవు నియోజకవర్గానికి నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. రెండుసార్లు మంత్రిగా పని చేశారు. వీరి రాజకీయ జీవితం తొలిసారి 1983లో తాళ్లరేవు నియోజకవర్గం నుండి స్వతంత్ర అభ్యర్థిగా…

Read More

దివ్యాంగుల హామీ నేటి నుంచి అమలు-బస్సులో ఉచిత ప్రయాణం.

అమరావతి: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు,అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా, గత ఏడాది డిసెంబర్ 3న వారికి ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు మంత్రివర్గంలో, చర్చించి ఈ పథకానికి నిధులు కేటాయించారు. ఈ పథకాన్ని గుంటూరులో ఈరోజు ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. కొన్ని బస్సుల్లో సగం ధరకు టికెట్లు రాయితీపై ఇస్తారు. దివ్యాంగులకు ఉన్న అర్హత శాతం బట్టి తోడుగా వచ్చేవారికి సగం ధర…

Read More

శ్రీ శ్రీ శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి ఆలయంలో ఉగాది వేడుకలు.

భీమవరం: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం పట్టణం లో వేంచేసి ఉన్న ప్రముఖ ఇలవేల్పు, ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారి దేవస్థానం పరాభవనామ సంవత్సర ఉగాది వేడుకలు అత్యంత వైభముగా నిర్వహించుటకు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా గురువారం ఉదయం 9 గంటలకు పంచాంగ శ్రావణం, అనంతరం కాళ్ల శివాలయం అర్చకులు తుమ్మపూడి శివ నాగ సత్య శ్రీను సీతారామ ప్రసాద్ కు సత్కారం చేయుచున్నారు.సాయంత్రం 6 గంటలకు గొల్లలకోడేరు…

Read More

రుద్ర హోమం, లీలా కళ్యాణం

పాలకొల్లు: మార్చి 17, (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ క్షీరా రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో మంగళవారం ఉదయం రుద్ర హోమం జరిగింది. ఈ సందర్భంగా శివ సహస్రనామ పూజలు చేశారు. లీలా కళ్యాణం సాయంత్రం జరిగింది. భక్తులు ఈ కార్యక్రమాల్లో పూజలు జరిపారు. ఆలయ కార్య నిర్వహణ అధికారి, ముచ్చర్ల శ్రీనివాసరావు, ధర్మకర్తల మండలి అధ్యక్షులు మీసాల రామచంద్ర రావు, ప్రధాన అర్చకులు క్రిష్టప్ప, అభిషేక పండితులు వెంకన్న, ఆలయ సిబ్బంది,భక్తులు పాల్గొన్నారు…

Read More

నాయి బ్రాహ్మణుల నిరసన ప్రదర్శన.

పాలకొల్లు: మార్చి, 17 (తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక నాయి బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన ప్రదర్శన నిర్వహించారు. తరతరాలుగా వస్తున్న, తమ జీవన ఆధారమైన కులవృత్తికి ఇతరులు పోటీ పడటం పట్ల సంఘం నిరసన వ్యక్తం చేసింది. కులవృత్తిని వ్యాపారంగా మార్చడం వల్ల, చిన్న, చిన్నషాపులు నడుపుకునే సామాన్య నాయి బ్రాహ్మణులు ఉపాధి లేక ఇబ్బందులు పడే పరిస్థితి ఎదురవుతుందన్నారు. బ్యూటీ పార్లర్ లాంటి వ్యాపారం చేసుకోవడం వల్ల తమకు ఎలాంటి నష్టం…

Read More

అమరజీవికి ఘన నివాళి.

పాలకొల్లు: మార్చి, 16(తెలుగు న్యూస్ పవర్. కామ్) అమరజీవి పొట్టి శ్రీరాములు 125వ జయంతి పాలకొల్లు సోమవారం ఘనంగా ఆర్యవైశ్య ప్రముఖులు నివాళులర్పించారు. స్థానిక గాంధీ బొమ్మల సెంటర్ వద్ద ఉన్న విగ్రహానికి, ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు రేపాక ప్రవీణ్ భాను పూలమాలవేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర అవతరణ కోసం జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయులని కొనియాడారు. ఈ కార్యక్రమంలో, మాటూరు నరసింహమూర్తి, నాళం బాపిరాజు, మన్యం జగ్గమ్మ సత్రం…

Read More