పాలకొల్లు: సెప్టెంబర్,19( తెలుగు న్యూస్ పవర్. కామ్) అంగన్వాడీ కేంద్రాలలో బాలలకు ప్రతిరోజు తాజా, వేడి ఆహారం, మెనూ ప్రకారం అందజేస్తారని
సూపర్ వైజర్ పి. సత్యవేణి తెలిపారు. స్థానిక అచ్చుగట్లపాలెం అంగన్వాడీ కేంద్రంలో పోషణ్ మాసోత్సవ కార్యక్రమం శనివారం నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే బాలామృతం బిడ్డలకు ఎంతో బలం ఇస్తుందని, తల్లులు తప్పక తమ పిల్లలకు అందించాలని కోరారు. పెరట్లో పెరిగే కూరగాయలు, మునగాకు ఆహారంలో ఉండేలా చూడాలన్నారు. మాంసకృత్తులు, పీచు పదార్ధాలు గల ఆహారం బాలలు బలంగా ఎదగడానికి తోడ్పడుతూడాన్నారు. ఈ కార్యక్రమంలో, ఎం ఎస్ కె హారిక, ఏఎన్ఎం ఆశ, తల్లులు పాల్గొన్నారు
అచ్చుగట్లపాలెం అంగన్వాడీలో పోషణ్ మాసోత్సవం.
పోషణ్ మాసోత్సవం నిర్వహిస్తున్న దృశ్యం.