పాలకొల్లు: సెప్టెంబర్,19( తెలుగు న్యూస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి ప్రభుత్వ స్వయం ప్రతిపత్తి కళాశాల,తెలుగు విభాగం ఆధ్వర్యంలో ప్రముఖ సామాజిక విప్లవ కవి, పద్మభూషణ్ డా బోయి భీమన్న జయంతి వేడుకలను శనివారం ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ డా. కె. రత్నమాణిక్యం అధ్యక్షత వహించారు. తెలుగు శాఖాధిపతి డా బూసి వెంకటస్వామి, తెలుగు అధ్యాపకులు రగుతు షణ్ముఖరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. బోయి భీమన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా, ప్రిన్సిపాల్ డా కె రత్నమాణిక్యం మాట్లాడుతూ, బోయి భీమన్న అక్షరాన్ని ఆయుధంగా మార్చి, సమాజంలోని కులవివక్షపై, అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన మహోన్నత మానవతావాది అని కొనియాడారు. ఆయన రాసిన ‘పాలేరు’ నాటకం సమాజంలో ఎంతోమంది పేద విద్యార్థులలో విద్యా చైతన్యాన్ని రగిలించి, ఉన్నత స్థానాలకు చేరేలా స్ఫూర్తినిచ్చిందని వెల్లడించారు. తెలుగు శాఖాధిపతి డా బూసి వెంకటస్వామి మాట్లాడుతూ, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు పొందిన ‘గుడిసెలు కాలిపోతున్నాయి’ వంటి కావ్యాలు సమాజ సమానత్వానికి దిక్సూచిగా నిలిచాయని పేర్కొన్నారు. తెలుగు భాషకు, సాహిత్యానికి భీమన్న చేసిన అసమాన సేవలను గుర్తించి భారత ప్రభుత్వం ఆయనను పద్మశ్రీ, పద్మభూషణ్ పురస్కారాలతో సత్కరించిందని వివరించారు.తెలుగు అధ్యాపకులు రగుతు షణ్ముఖరావు మాట్లాడుతూ, విద్యార్థులంతా భీమన్న ఆశయాలను, క్రమశిక్షణను స్ఫూర్తిగా తీసుకుని జీవితంలో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమం లో వైస్ ప్రిన్సిపాల్ టి శ్రీకృష్ఞ ,అకడమిక్ కో ఆర్డినేటర్ జి సుమలత, జె కె సి కో ఆర్డినేటర్ కె.శామ్యూల్, స్టూడెంట్స్ కౌన్సిల్ కో ఆర్డినేటర్ డా వి డి వి విజయలక్ష్మి, అర్ధశాస్త్ర విభాగాధిపతి నరేంద్ర వి శ్రీ రామ్,అధ్యాపకులు పి సునీల్ కుమార్, మన్మధరావు,ఆశాజ్యోతి, స్వర్ణలత, పార్థసారథి, జయలక్ష్మి, రోహిత్ కుమార్, ఎం శిరీష, విద్యార్థినీ,విద్యార్థులు పాల్గొన్నారు.
శ్రీ అద్దేపల్లి కళాశాలలో బోయి భీమన్న జయంతి వేడుకలు.
బోయ భీమన్నకు నివాళులర్పిస్తున్న అధ్యాపకులు, విద్యార్థులు