పాలకొల్లు: జూలై,29( తెలుగు న్యూస్ పవర్. కామ్) మరో నెలలో పదవీకాలం ముగుస్తున్నప్పటికీ గత మూడేళ్లుగా మండల పరిషత్ సభ్యులకు చెల్లించవలసిన గౌరవ వేతనం ఒక్క రూపాయి కూడా చెల్లించలేదని అధ్యక్షురాలు చిట్టూరి కనక లక్ష్మీ ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక బాలయోగి మండల పరిషత్ సమావేశ మందిరంలో మండల పరిషత్ అభివృద్ధి అధికారి ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో బుధవారం మండల పరిషత్ సమావేశం జరిగింది. అధ్యక్షురాలు వివిధ శాఖల పని తీరు ప్రగతిపై సమీక్ష నిర్వహించారు. కోవిడ్ ఉధృతి పెరుగుతున్న దృశ్య వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలని కోరారు. సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎంపీపీ సూచించారు. జడ్పిటిసి నల్లపూల గోవిందరాజులు నాయుడు, మాట్లాడుతూ వివిధ సమస్యలపై కార్యాలయాలకు వచ్చే ప్రజల కు చేరువై వారి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ఈ సమావేశంలో, పడవల సునీల్ బాబు, శాక సత్యనారాయణ, వడ్డే సోమశేఖర్, డిప్యూటీ ఎంపీడీవో దేవరపు పద్మాజీరావు, ఏ ఓ కె.వి.ఆర్ నాయుడు, ఎం ఏ ఓ కుసుమ రాజశేఖర్, ఎంపీటీసీ సభ్యులు, ఆయా శాఖల అధికారులు పాల్గొన్నారు.
పదవీకాలం ముగుస్తున్న గౌరవ వేతనం లేదు. -మండల పరిషత్ సభ్యుల ఆవేదన.
మండల పరిషత్ సమావేశంలో మాట్లాడుతున్న అధ్యక్షురాలు కనక లక్ష్మి