Skip to main content

Telugu News Power

ఆర్యవైశ్యుల దాతృత్వం, పాలకొల్లు అభివృద్ధికి వరం. -మంత్రి నిమ్మల

పాలకొల్లు: జూలై, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) పట్టణలో విద్య, వైద్యరంగం అభివృద్ధికి,సత్రాల ఏర్పాట్ల వంటి దాతృత్వ కార్యక్రమాలకు శతాధిక సంవత్సరాలుగా ఆర్యవైశ్య సమాజం ఇతోధికంగా సేవలు అందిస్తున్నారని స్థానిక శాసనసభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నాయుడు కీర్తించారు. స్థానిక మన్యం జగ్గమ్మ సత్రం నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారోత్సవానికి మంత్రి ఆదివారం రాత్రి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మడుచు పట్టణాల్లోని అద్దేపల్లి, బొండాడ, సలాది, రేపాక, మన్యం తదితర ఆర్యవైశ్య కుటుంబాల వారు పా లకొల్లు ప్రగతికి మూలస్తంభాల వంటి వారిని కొనియాడారు. ఇంతకము సత్రం మండలి అధ్యక్షులుగా, మండాది నాగ వెంకట అవినాష్, సభ్యులుగా, కొమ్ముల దినేష్ బాబు, అన్నా బత్తుల రోజాలిన్, గోమటం హేమ, పి అనంతలక్ష్మి, కూతాడ శ్రీనివాస రావు, మేక వీర వెంకట సత్యనారాయణ, ఇస్సాకు నాగలక్ష్మి, అన్నా బత్తుల లక్ష్మి ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో, కార్యనిర్వహణాధికారి పులగం గోపాలరావు ఛాంబర్స్ కళాశాల చైర్మన్, కారుమూరు వెంకట నరసింహారావు, కర్నేని గౌర నాయుడు, పెచ్చెట్టి బాబు, గండేటి వెంకటేశ్వరరావు, కె.వి సీతారామరాజు, ఉన్నమట్ల కాపర్తి, బోనం చినబాబు, వల్లభు శ్రీనివాసరావు, తెలనాకుల కోటేశ్వరరావు, మీసాల రామచంద్ర రావు, తులా రామలింగేశ్వరరావు, పెండ్యాల భవాని, మై గాపుల పద్మజ, పినిశెట్టి చిన్న, కొల్లి కొండ ప్రసాద్, మల్లవోలు సురేష్, పీతల శ్రీనివాస్ పాముల రజనీ కుమార్, మామిడి శెట్టి పెద్దిరాజు, పెనుమత్స రామభద్ర రాజు, బోనం నాని, ఆరమిల్లి రామ శ్రీనివాస్, సిడగం సురేంద్ర, జగ్గు రోతు రాంబాబు తదితరులు పాల్గొన్నారు