పాలకొల్లు: జూలై, 27( తెలుగు న్యూస్ పవర్. కామ్) తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి, నారా చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్థానిక శాసన సభ్యులు, రాష్ట్ర జలవనరుల శాఖామాత్యులు నిమ్మల రామానాయుడు, స్థానిక లాకుల సమీపంలోని 21వ వార్డులో ఇంటింటికి తెలుగుదేశం పార్టీ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా, వార్డులోని ప్రజలను కలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అమ్మ తీరును తెలుసుకున్నారు. ఇద్దరికీ పింఛను వస్తున్నట్టు సంతృప్తి వ్యక్తం చేశారు. ఓ మహిళ తమ ఇంటిలో ముగ్గురు పిల్లలకి తల్లికి వందనం పధకం ద్వారా 39 వేల రూపాయలు అందిందని ఆనందం వ్యక్తం చేశారు. రోజువారి తోపుడు బండికి అద్దె చెల్లిస్తున్నందున, బండి ఇప్పించవలసిందిగా యు.కృష్ణ కోరగా, మంత్రి ఆమె వరకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వ పాలన అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలుతో ప్రగతి వైపు పరుగులు తీస్తుందన్నారు. గత జగన్ ప్రభుత్వం విధ్వంస పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని గుర్తు చేశారు. పింఛను వెయ్యి రూపాయల పెంచడానికి వైసిపి ప్రభుత్వం ఐదేళ్లు సాగదీసిందని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే రూ. 4 వేలు పెంచి బకాయితో సహా ఒకేసారి చెల్లించిన విషయాన్ని ప్రజలకు వివరించారు. దివ్యాంగుల పెన్షన్ రూ. 6 వేలు, 15వేలు పెంచిందని తెలిపారు. జగన్ ప్రభుత్వం ఐదేళ్లలో ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ కూడా భర్తీ చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వం మొదటి ఏడాదిలోనే 16 వేలకు పైగా మెగా డీఎస్సీలో పోస్టులు భర్తీ చేసిందని వివరించారు. తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది ఉన్నా, విద్యార్థులందరికీ తల్లికి వందనం ద్వారా తల్లుల గత రెండువేళ్ళు జనం చేస్తున్నట్టు వివరించారు. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం అమలు చేయడం వల్ల వారి మహిళా శక్తికి ఊతం ఇస్తుందన్నారు. ప్రజలకు మేలు చేస్తున్న ప్రభుత్వానికి అండగా నిలవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో, టిడిపి రాష్ట్ర నాయకులు పెచ్చెట్టి బాబు, పట్టణ అధ్యక్షులు గండేటి వెంకటేశ్వరరావు,, క్లస్టర్ అధ్యక్షులు పొట్నూరి శ్రీనివాస్, పలువురు స్థానిక నాయకులు పాల్గొన్నారు.
“ఇంటింటికి తెలుగుదేశం” కార్యక్రమం లో మంత్రి నిమ్మల.
ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి నిమ్మల