Telugu News Power

ఉక్కు కర్మాగార ప్రమాదం పై కమిటీతో సమావేశం జరిపిన కేంద్ర సహాయ మంత్రి.

ఉక్కు శాఖ అధికారులతో సమావేశమైన కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ

విశాఖపట్నం: జూన్, 9(తెలుగు న్యూస్ పవర్. కామ్) కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ మంత్రి, భూపతి రాజు శ్రీనివాస వర్మ
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో జరిగిన ప్రమాదంపై కేంద్ర ఉక్కు మంత్రిత్వ శాఖ నియమించిన ఉన్నత స్థాయి ముగ్గురు సభ్యుల కమిటీతో మంగళవారం విశాఖపట్నంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.ఈ కమిటీలో సభ్యులుగా ఉన్న స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) నిపుణులు ప్రియరంజన్, బొకారో ఉక్కు ఫ్యాక్టరీ ఇంచార్జ్ డైరెక్టర్, చీఫ్ జనరల్ మేనేజర్, జితేంద్ర కుమార్, మాజీ చీఫ్ జనరల్ మేనేజర్, గోపాల్ సింగ్ లతో కలిసి ప్రమాదం జరిగిన తీరు, దానికి గల కారణాలు, ప్లాంట్‌లోని ప్రస్తుత క్షేత్రస్థాయి పరిస్థితులపై విస్తృతంగా చర్చించారు.ఇలాంటి ప్రమాదాలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ప్లాంట్‌లో తీసుకోవాల్సిన పటిష్టమైన భద్రతా చర్యలపై, కార్మికుల రక్షణపై కమిటీ సభ్యులు సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.