Skip to main content

Telugu News Power

ఆక్వా రైతుల ఆక్రందన, వినతిపత్రాలల్లో తాసిల్దార్లకు విన్నపం.

రాష్ట్ర అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు, తాసిల్దార్ కిషోర్ కు వినతి పత్రం అందజేస్తున్న దృశ్యం

పాలకొల్లు: జూన్, 16 (తెలుగు న్యూస్ పవర్. కాం) ఫీడ్ ధరల పెంపు పై ఆగ్రహించిన ఆక్వా రైతులు తమ ఉద్యమ ప్రారంభ ఘట్టంలో భాగంగా మంగళవారం రాష్ట్రంలోని తహసిల్దార్ కార్యాలయాలతో వినతి పత్రాలు అందజేసే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకొల్లు రాష్ట్ర ఆక్వా రైతు సంఘం అధ్యక్షులు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు ఆధ్వర్యంలో భారీగా తరలివచ్చిన రొయ్యలు రైతులు వెంటనే ఫీడ్ ధరలు తగ్గించాలని నినాదాలు చేశారు. అధ్యక్షులు గాంధీ భగవాన్ రాజు మాట్లాడుతూ, రొయ్యల ఫీడ్ ధర 10 నుంచి 12 రూపాయల వరకు ఏకపక్షంగా, గుత్తాది పచ్చి ధోరణిలో పెంచేశారని పేర్కొన్నారు. ధరల నియంత్రణకు ఏర్పాటు చేసిన, అప్సడ ఆమోదముద్ర వేయకుండానే రేట్లు పెంచడానికి రైతులు నిరసించారు. రొయ్యల ధరలు తగ్గి, విద్యుత్ కోతలు, డీజిల్ ధరల పెంపు, వైరస్ వ్యాధులు తదితర సమస్యల వల్ల ఇప్పటికే ఆ క్వారైతులు తీవ్రంగా నష్టపోయారని తెలిపారు. తహసిల్దార్ యడ్ల దుర్గా కిషోర్, ప్రభుత్వ దృష్టికి ఆక్వా రైతుల సమస్యలు తీసుకువెళతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో బోనం చినబాబు, దేవుళ్ళ ప్రసాద్, మేకప్ ఫణీంద్ర, పెనుమత్స సత్యనారాయణ రాజు, అంగర వరప్రసాద్, తదితర పరుగులు రైతులు పాల్గొన్నారు.