విజయవాడ: మార్చి,17(తెలుగు న్యూస్ పవర్. కాం) స్థానిక
నగర పోలీసు కమిషనర్ ఎస్.వి.రాజ శేఖర బాబు, ఐ.పి.ఎస్. కు కేంద్ర ప్రభుత్వం వారు అంధించే ప్రతిష్టాత్మకమైన అతి ఉత్కృష్ట సేవా పతకం -2025 వరించింది.
పోలీసు శాఖ లో అత్యంత ప్రతిభావంతంగా, నిష్కల్మషంగా, అంకితభావంతో, అత్యుత్తమ సేవలు అందించి, విధి నిర్వహణలో నిబద్ధత, ప్రజల భద్రత, నేర నియంత్రణ వంటి అంశాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి విశిష్టమైన సేవలు అందించిన ఉత్తమ సేవలకు గాను ఎన్.టి.ఆర్.జిల్లా పోలీసు కమిషనర్ శ్రీ ఎస్.వి.రాజ శేఖర బాబు ఐ.పి.ఎస్.గారికి కేంద్ర ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకమైన అతి ఉత్కృష్ట సేవా పతకం -2025 ప్రకటించారు. ఈ సందర్భంగా, పలువురు రాజశేఖర్ బాబు ను అభినందించారు.
