న్యూఢిల్లీ: మార్చి, 17(తెలుగు న్యూస్ పవర్. కామ్) భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు నితిన్ నవీన్ రాజ్యసభకు సోమవారం ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా, కేంద్ర భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మాత్యులు సత్య కుమార్ లు నితిన్ నవీన్ మంగళవారం అభినందించి, సత్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతీయ జనతా పార్టీ బలోపేతానికి మరింత ప్రోత్సాహం నితిన్ నాయకత్వంలో లభిస్తుందన్నారు. వీరి అనుభవం దేశాభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతుందన్నారు. వీరి నూతన ప్రయాణం దిగ్విజయం కావాలని ఆకాంక్షించారు. శుభాభినందనలు తెలియజేశారు.
