Telugu News Power

శ్రీ ఏ ఎస్ ఎన్ ఎం కళాశాల సెమిస్టర్ ఫలితాలు విడుదల.

ఫలితాలు విడుదల చేస్తున్న ప్రిన్సిపల్ టి రాజరాజేశ్వరి

పాలకొల్లు: ఏప్రిల్, 21 (తెలుగు మూవీస్ పవర్. కామ్) స్థానిక శ్రీ అద్దేపల్లి సత్యనారాయణమూర్తి స్వయం ప్రతిపత్తి ప్రభుత్వ కళాశాలలో 4వ సెమిస్టర్ పరీక్షా ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డా. టి. రాజరాజేశ్వరి మంగళవారం విడుదల చేశారు.
ఈ సందర్భంగా, ఆమె మాట్లాడుతూ, మార్చి 26 నుండి ఏప్రిల్ 8 వరకు నూతన మూల్యాంకన విధానంలో ఈ పరీక్షలు నిర్వహించామని తెలిపారు.
4 వ సెమిస్టర్‌లో మొత్తం 197 మంది విద్యార్థులు హాజరుకాగ, వీరిలో 192 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఉత్తీర్ణత శాతం 97.46 గా నమోదయ్యింది.
ఈ సందర్భంగా డా. టి. రాజరాజేశ్వరి గారు ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందించారు. విద్యార్థులు తమ ఫలితాలను కళాశాల వెబ్‌సైట్‌లో చూడవచ్చని ఆమె పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో కంట్రోలర్ అఫ్ ఎగ్జామినేషన్ టి. కృష్ణ, పరీక్షల కమిటీ సభ్యులు మరియు అధ్యాపకులు పాల్గొన్నారు.